తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి.పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు అధికారంలోకి రావడమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తుంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల లిస్టును ప్రకటించగా తాజాగా తెలంగాణ టీడీపీ కూడా అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.ఇందులో భాగంగా 30 మందితో టీటీడీపీ తొలి జాబితాను ప్రకటించింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో నిలవనున్నారు.అదేవిధంగా వనపర్తి నియోజకవర్గంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి అరవింద్ కుమార్ గౌడ్, షాద్ నగర్ నుంచి బక్కని నర్సింహులు, పరిగి నుంచి కాసాని వీరేశ్ ముదిరాజ్ తదితరుల పేర్లను పార్టీ ప్రకటించింది.