హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో జరిగిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.గతంలో దివ్యాంగులను ఏ పార్టీ, ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు.
దివ్యాంగులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కింద రూ.2.25 లక్షలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.ప్రస్తుతం దివ్యాంగులకు రూ.4,016 పెన్షన్ ఇస్తున్నామన్న కేటీఆర్ మళ్లీ గెలిచిన తరువాత దివ్యాంగులకు రూ.6,016 పెన్షన్ ఇస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ బీజేపీకి బీ-టీమ్ కాదన్న కేటీఆర్ కాంగ్రెస్ దేశానికి సీ -టీమ్ అని విమర్శించారు.ఈ క్రమంలో సీ -టీమ్ అంటే చోర్ టీమ్ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఏ టు జెడ్ స్కామ్ లు చాలా ఉన్నాయన్న కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి బీజేపీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.కేసీఆర్ ది కుటుంబ పాలన అని రాహుల్ మాట్లాడుతున్నారన్నారు.
అయితే రాహుల్ గాంధీది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు.