క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క కీలక పాత్రలలో వచ్చిన సినిమా వేదం.ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోయినా ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.
ఒక వ్యక్తి జీవితాలలోకి తొంగి చూస్తే ఎన్నో వేదనలు ఉంటాయనే ఎలిమెంట్ తో క్రిష్ ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం ప్రాణం పోసింది.
ఆ తరువాత కీరవాణి సినిమాలు తగ్గించడం, క్రిష్ కూడా ఇతర సంగీత దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపించడంతో మళ్ళీ వీరి కాంబినేషన్ సెట్ కాలేదు.అయితే చాలా సంవత్సరాల తర్వాత క్రిష్, కీరవాణి కాంబినేషన్ సెట్ అయ్యింది.
అది కూడా కుర్ర హీరో సినిమా కోసం.దర్శకుడు క్రిష్ ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో సినిమా స్టార్ట్ చేశాడు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిపొయింది.
రొమాంటిక్ లవ్ స్టొరీగా ఈ సినిమా ఉండబోతుంది.దీంతో సంగీతానికి ప్రాధాన్యత ఉంది.
ఈ నేపధ్యంలో ఎమోషనల్ లవ్ స్టొరీలకి కీరవాణి బెస్ట్ అని భావించి క్రిష్ అతనితో వర్క్ చేయడానికి రెడీ అయ్యారు.ఇక ఈ సినిమాని వీలైనంత వేగంగా ఒకటి, రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేయాలని క్రిష్ భావిస్తున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయ్యి ఉండటంతో వీలైనంత వేగంగా వైష్ణవ్ మూవీ పూర్తి చేసి దానిపైకి వెళ్ళాల్సి ఉంది.అందుకే తక్కువ మంది నటీనటులతో తెరకెక్కే చిత్రం కావడం వలన వేగంగా పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు.
ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తునారని తెలుస్తోంది.ఇందులో శృంగారభరిత దృశ్యాలు చాలానే ఉంటాయని చెబుతున్నారు.