దీప్తి సునయన. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇందుకు గల ముఖ్య కారణం సోషల్ మీడియా.సోషల్ మీడియాలో మంచి స్టార్ గా ఉన్నా ఈమె, బిగ్ బాస్ 2 సీజన్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అంతేకాకుండా ఒక మంచి సెలబ్రిటిగా పేరు తెచ్చుకొని యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ఎప్పటికప్పుడు తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది దీప్తి సునయన.బిగ్ బాస్ 2 లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తనీష్ తో నడిపిన ప్రేమాయణం కూడా అప్పట్లో ఒక సెన్సేషన్ గా మారింది.
అనంతరం దీప్తి, తనీష్ బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు.
ఇది ఇలా ఉండగా.అప్పటికే దీప్తికి ఒక బాయ్ ఫ్రెండ్ వున్నాడని, అతని పేరు షణ్ముఖ్ అని అందరికీ తెలిసిన విషయమే.ఇక షణ్ముఖ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇతను కూడా ఒక సెన్సేషన్ స్టార్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకొని మంచి ఫాలోయింగ్ తో ఒక స్టార్ లాగా ఎదిగిపోయాడు.అలాగే ఎప్పటికప్పుడు షార్ట్స్ ఫిలిమ్స్ చేస్తూ యువతను బాగా అక్కట్టుకున్నాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి దీప్తి, షణ్ముఖ్ విడిపోయారు.
ఇది ఇలా ఉండగా.
తాజాగా స్టార్ మా లో 100% లవ్ అంటూ ఒక ప్రోగ్రాం మొదలైపోయింది.ఈ ప్రోగ్రాం లో భాగంగా చాలా రోజుల తర్వాత దీప్తి, షణ్ముఖ్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు కనబడ్డారు.
ఈ షోలో దీప్తి, షణ్ముఖ్ ప్రేమను ఓపెన్ గా అందరికీ తెలియజేశారు.అంతేకాకుండా ఒకరినొకరు ప్రేమించుకున్నామని ప్రేక్షకులకు తెలిపారు.
ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.