తద్వారా పిల్లల శరీరంలో నీటి స్థాయిలు పడిపోకుండా ఉంటాయి.అలాగే వేసవిలో పిల్లలకు మందపాటి బట్టలను పొరపాటున కూడా వేయరాదు.
మందంగా ఉండే దుస్తులు శరీరాన్ని మరింత వేడెక్కించేస్తాయి.అందుకే వదులైన దుస్తులనే పిల్లలకు వేయాలి.
సమ్మర్‌లో చాలా మంది పిల్లలు డయేరియా బారిన పడుతుంటారు.ఈ సమస్య నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే.
ఇంట్లో వండిన తాజా ఆహారాలనే పిల్లలకు పెట్టాలి.మండే ఎండల్లో వారిని ఆటలకు పంపరాదు.
ఉదయం, లేదా సాయంత్రం ఎండ తీవ్రత తక్కువగా ఉండే సమయంలోనే పిల్లలను ఆరుబయట ఆడనివ్వాలి.
"""/" /
సమ్మర్‌లో కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, కూలింగ్ వాటర్, స్వీట్స్ వంటి వంటికి పిల్లలను దూరంగా ఉంచాలి.
వాటి బదులు తాజా ఆకుకూరలు, పెరుగు, తాజా పండ్లు, చక్కెర జోడించని స్మూతీలు, సీఫుడ్, సలాడ్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి.
ఇక వేసవి వేడి ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండేందుకు ఏసీల్లోనే గంటలు గంటలు వారిని ఉంచడం కూడా కరెక్ట్ కాదు.
అలా చేయడం వల్ల మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి పదినిమిషాల పాటైనా గడపాలి.