రాగులు వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.పూర్వ కాలం నుంచి రాగులను విరి విరి వాడుతున్నారు.
రాగులతో రొట్టెలు, సంగటి, జావలు, ఇడ్లీలు, దోసలు ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు.రాగులతో ఎలా చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.
రుచిలోనే కాదు ఆరోగ్య పరంగా కూడా రాగులు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.మిగతా చిరు ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో ఎక్కువ పోషకాలు లభ్యమవుతాయి.
క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ ఎ, అమినో యాసిడ్స్, అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో అనేక పోషకాలు రాగుల్లో నిండి ఉంటాయి.అందుకే రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే రాగులు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటిక అతిగా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలను తెచ్చిపెడతాయి.
సాధారణంగా కొందరు ఆరోగ్యానికి మంచివని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటలు రాగులనే తీసుకుంటారు.కానీ, ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు.రాగులను అతిగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
రాగుల్లో గోట్రోజెన్ అనే కంటెంట్ థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తికి అంతరాయాన్ని కలిగిస్తుంది.మరియు థైరాయిడ్ గ్రంధి ఆయోడిన్ గ్రహించే శక్తిని కోల్పోతుంది.
దాంతో థైరాయిడ్ బారిన పడాల్సి వస్తుంది.
అలాగే రాగులను అతిగా తీసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడి ప్రమాదం కూడా ఉంటుంది.ఒక వేళ మీకు మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే గనుక రాగులను చాలా లైట్ తీసుకోవాలి.ఇక రాగులను ఓవర్ తీసుకుంటే జీర్ణ సంబంధితన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అందువల్ల, రాగులను అతిగా కాకుండా రోజులో ఒక పూట తీసుకుంటే మంచిది.
.