వైరల్: పాలు తాగుతున్న ఆ నంది విగ్రహం..?!

నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది.కమ్మర్ పల్లి( Kammer Palli ) మండలం బషీరాబాద్‌లో అరుదైన సంఘటన జరిగింది.

 Viral That Statue Of Nandi Drinking Milk, Viral News, Statue Of Nandi, Drinking-TeluguStop.com

ఇక్కడ ఉన్న మహదేవుని ఆలయంలోని నందీశ్వరుని విగ్రహం( Nandiswara Statue ) నుంచి పాలు వస్తున్నాయి.ఇది చూసి అక్కడి భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకి తెలియడంతో చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు.దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది.

ఈ వింత సంఘటనను చూసేందుకు ఎగబడుతున్నారు.

నందీశ్వరుని నుంచి పాలు రావడడం చూసి షాక్ అవుతున్నారు.ఇదంతా దేవుడి మహిమ అంటూ భక్తులు చెబుతున్నారు.నందిశ్వరునికి స్పూన్ తో పాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లు పట్టిస్తున్నారు.

నందీశ్వరుడు వీటిని తాగుతుండటంతో అవాక్కవుతన్నారు.ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకడంతో కమ్మరపల్లి మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు కూడా చూసేందుకు తరలివస్తున్నారు.

కొంతమంది ముందుగా విని ఇదంతా అబద్ధం అని అనుకున్నారు.కానీ ఘటనా స్థలానికి వచ్చి చూసిన తర్వాత పాలు తాగడం చూసి నిజమని నమ్ముతున్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివుడిని దర్శించుకుంటున్నారు.అనంతరం నంది విగ్రహనికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.అనంతరం నందీశ్వరుడికి పాలు, నీళ్లు పట్టిస్తున్నారు.అయితే కొంతమంది నాస్తికులు ఇందులో నిజం లేదని అంటున్నారు.దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్( Scientific Reasons ) ఉంటాయని చెబుతున్నారు.కొన్ని రాతి విగ్రహాలు, ఇసుకరాయి, లేదా మట్టితో తయారైన దేవుడి ప్రతిమలకు నీటిని పీల్చుకునే గుణం ఉంటుందని, ఈ నందీశ్వరుడి విషయంలో కూడా జరుగుతున్నదని పేర్కొంటున్నారు.

సర్ఫేస్ టెన్షన్ అనే ప్రక్రియ వల్ల ఇలా జరుగుతూ ఉంటుందని, అంతేకానీ దేవుడు పాలు తాగడం అనేది ఉండదని క్లారిటీ ఇస్తున్నారు.బంగారం లేదా వెండితో తయారుచేసిన విగ్రహలకు పాలు తాగించి చూస్తే మీకు అర్థం అవుతుందని చెబుతున్నారు.

మొత్తానికి నందీశ్వరుడు పాలు తాగే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube