ఆర్థిక క్రమశిక్షణ లేక.. బస్సు క్లీనర్ స్థితికి దిగజారిన స్టార్ క్రికెటర్..

క్రిస్‌ కెయిన్‌.ఒకప్పటి న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్.

 New Zealand Chirs Carins Financial Situations , Chris Cain, New Zealand, Cricket-TeluguStop.com

ఇండియాతో మ్యాచ్ అంటే తను ఎప్పుడూ దూకుడుగా ఉండేవాడు.తన బ్యాట్ తో పాటు బాల్ తోనూ అద్భుత ప్రదర్శన చేసేవాడు.

భారత్ ను చాలా సార్లు తన ఆటతీరుతో ఓటమి అంచుకు చేర్చాడు.కానీ తను నిజ జీవితంలో మాత్రం ఆర్థిక క్రమ శిక్షణ నేర్చుకోలేదు.

అదే ఆయకు తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెట్టింది.తను క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక విలాసాలకు బానిసై ఎంతో వేదన అనుభవించాడు.

చివరకు రోడ్డు మీద బస్సులను కడిగే స్థాయికి చేరుకున్నాడు.

చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉండే తను మీడియం ఫేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే గాయాలు ఆయన కెరీర్ కు పెద్ద దెబ్బగా మారాయి.క్రికెట్ లో మంచిగా రాణిస్తున్న సమయంలోనే గాయాల కారణంగా 2006లో రిటైర్మెంట్ ప్రకటించాడు.అప్పటికే న్యూజిలాండ్ టెస్టు, వన్డే జట్టుల్లో స్టార్ క్రికెటర్ తను.అయితే తను డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటించకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.చివరకు బస్సులు కడిగే స్థితికి చేరుకున్నాడు.ఇదే సమయంలో తనకు గుండెపోటు వచ్చింది.ఆస్పత్రిలో చేరిన తను చికిత్స కోసం దాతల వైపు చూసే పరిస్థితి ఎదురయ్యింది.ఒకప్పుడు వజ్రాల రింగుతో తన ప్రేమను వెల్లడించిన తన భర్త స్థితిని చూసి తన భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది.

Telugu Chris Cain, Cricketer, Zealand, Zealandchirs-Telugu Stop Exclusive Top St

కెయిన్స్ వజ్రాల వ్యాపారిగా న్యూజిలాండ్ లో ఓ కంపెనీ రన్ చేశాడు.కాన డబ్బును పొదుపు చెయ్యడంలో విఫలం అయ్యాడు.వస్తున్న రాబడికి, చేస్తున్న ఖర్చుకు పొంతన లేకపోవడంతో తీవ్ర అవస్థలకు గురయ్యాడు.భారీ నష్టాలతో డైమండ్‌ కంపెనీని మూసివేశాడు.ఐదేళ్ల సమయంలోనే తన జీవితం పూర్తిగా మారిపోయింది.చిన్నా చితకా పనులు చేస్తే వచ్చిన డబ్బును కూడా మితంగా వాడలేకపోయాడు.

చివరకు ప్రాణాపాయ స్థితిలో మరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం తలెత్తింది.చివరకు తన పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube