బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ దివ్యవాణి సినిమాల్లోకి రావడానికి కారణమైందీ, ప్రేరణనిచ్చిందీ ఊర్వశి‘శారద చాలా మందికి తెలియదు.
ఇక ఊహ తెలిసినప్పట్నుంచీ ఇంట్లో అందరితో పాటు సినిమాలు చూడ్డం అలవాటైంది దివ్యకు.ముఖ్యంగా శారద నటించిన చిత్రాలంటే మరీ ఇష్టంగా చూస్తూండేదంట.
అయితే శారద వాళ్ల ఊరూ, దివ్య ఊరూ ఒకటే కావడం వల్ల – వారి కుటుంబానికీ, దివ్య కుటుంబానికీ సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా, శారదతో దివ్య సన్నిహితంగా ఉండేది.
ఇక దివ్యను చూసి శారద, సినిమాల్లో నటించకూడదూ నటిగా రాణిస్తావు అని ఆమె ప్రోత్సహించారంట.
అయితే కేవలం మాటలతో సరిపెట్టకుండా మొట్టమొదటిసారిగా దివ్యకు మేకప్ స్టిల్స్ కూడా తీయించారంట.ఆ తరువాత శారద ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటించడం కోసం దివ్య మద్రాసు వెళ్లింది.
కాగా శారద ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు దివ్యను పరిచయం చేశారు.పరుచూరి రికమండేషన్‌తో సర్దార్ కృష్ణమనాయుడు సినిమాలో హీరో కృష్ణ చెల్లెలిగా తొలిసారిగా దివ్య చిత్రరంగ ప్రవేశం చేసింది.
దివ్య వ్యక్తిగత విషయాలకు వస్తే దివ్యవాణి అసలు పేరు ఉష ఆమె తెనాలి ప్రాంతానికి చెందిన ఆమె.ఇక ఆమె పదో తరగతి వరకు చదువుకుంది.దివ్యవాణి తెలుగుతో పాటలు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ నటించి, ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఇకఅడవిలో అర్ధరాత్రి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైనప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కె.
ఎస్.ఆర్.
దాస్ ఆమె పేరును స్వాతిగా మార్చారంట.అయితే స్వాతి పేరుతోనే సర్దార్ కృష్ణమనాయుడు లాయర్ భారతీదేవి చిత్రాల్లో నటించింది ఆమె.అయితే 1991లో బాపు తీసిన పెళ్లి పుస్తకందివ్యవాణి నట జీవితంలోనే మైలురాయిగా మారింది.
కాగా.ఆమెకు బాపుబొమ్మఅనే పేరు వచ్చింది కానీ పెళ్లి తర్వాత ఆమె రూపం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.ఇక బాపు తీసిన రాధా గోపాళం(2005) మూవీలో వేణుమాధవ్ భార్య పాత్రలో దివ్యను చూసినవాళ్లంతా, ఆమె స్థూలకాయం చూసి ఆశ్చర్యానికి గురైయ్యారు.