గ్రామ స్వరాజ్యం,సమగ్ర అభివృద్ధే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యం: మంత్రి పువ్వాడ అజయ్

అన్ని వర్గాలు సమానంగా ప్రగతి సాధించాలనే ఉద్దేశంతోనే గ్రామాల అభివృద్ది సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృడ సంకల్పంతో గ్రామాల స్వరూపమే మార్చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

 Gram Swaraj Comprehensive Development Is The Aim Of Brs Government Minister Puvw-TeluguStop.com

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలోని నూతన గ్రామ పంచాయతీ భావనలకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.

సూర్య తండా, పుఠని తండా, కొర్లబొడు తండా, బద్య తండా, జింకల్ తండా, హర్య తండా గ్రామాల్లో మంజూరైన గ్రామ పంచాయతీ భవనలు ఒక్కో భవనం రూ.20 లక్షలు మొత్తం 1.20 కోట్లతో నిర్మించనున్న ఆయా నిర్మాణ పనులకు గురువారం మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

కేవలం ఎనిమిదేండ్లలోనే ఎంతో పురోగతి సాధించామన్నారు.పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు కాల్వలకు మరమ్మతులు, చెరువుల పూడికలు చేయడంతో గ్రామాల్లో పుష్కలంగా త్రాగు, సాగు నీరందుతుందని, వలసలు వెళ్లిన వారు స్వగ్రామాలకు వచ్చి పని చేసుకుంటున్నారన్నారు.

ఇదంతా సీఎం కేసీఆర్‌ ఘనతేనని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌ గారిదేనని, గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని తెలిపారు.

17 గ్రామ పంచాయతీలు ఉన్న మండల్లంలో 20 తండా లను గ్రామ పంచాయతీలుగా ఎర్పాటు చేసుకున్నామని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు తాండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చడం జరిగిందని తద్వారా తమ ఊరి అభివృద్ధి తామే చేసుకునే విధంగా పరిపాలన సౌలభ్యం కల్పించిందని తెలియజేశారు.

తాండాలు, గూడెం లలో అవసరమైన మౌలిక సదుపాయాలు విద్యుత్తు, రోడ్లు, పాఠశాలలు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు తదితర అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తుందని తెలియజేశారు.

గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పట్టణాలపై ఒత్తిడి తగ్గిందన్నారు.మారుతున్న కాలానికనుగుణంగా గ్రామీణ జీవన విధానంలో మార్పులు వస్తున్నాయని చెప్పారు.

గ్రామాలకు సాగునీరు రావడంతో ప్రతి ఒక్కరికీ చేతినిండా పనులు దొరుకుతున్నాయన్నాయని, పట్టణాలకు వలసవెళ్లిన వారు కూడా తిరిగి గ్రామాలకు వచ్చి జీవనం కొనసాగిస్తున్నారన్నారు.

తెలంగాణలో మాదిరిగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ విధానం ఎక్కడా లేదన్నారు.

లో-ఓల్టేజీ సమస్యలు అధిగమించేందుకు రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ఈ సందర్భంగా గ్రామాల పారిశుధ్యంలో కీలక భూమిక పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను శాలువా కప్పి సత్కరించారు.

అనంతరం దుస్తులు అందజేసి సఫాయి అన్న నీకు సలాం అన్న అంటూ నినాదాలు చేశారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ VP గౌతమ్, ITDA PO P.గౌతమ్ స్నేహలత మొగిలి, DRDA PD విద్యా చందన, CEO అప్పారావు, PR EE KVK శ్రీనివాస్, మిషన్ భగీరధ EE వాణిశ్రీ, DCO విజయ కుమారి, MDO రామకృష్ణ, ITDA EE తానాజీ, DE రాజు, జడ్పిటిసి ప్రియాంక, ఎంపిపి గౌరీ, సర్పంచ్ లు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube