ఢిల్లీలోని ముఖర్జీనగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ముఖర్జీనగర్ లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు.బిల్డింగ్ లోని పై అంతస్తులో ఉన్నవారు తాళ్ల సాయంతో కిందకు దిగారు.
కాగా 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.







