సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది పొడవాటి జుట్టును( Long Hair ) కోరుకుంటారు.కానీ పోషకాల కొరత, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల జుట్టు చాలా పొట్టిగా పల్చగా మారిపోతుంటుంది.
ఇటువంటి జుట్టుతో మీరు కూడా బాధపడుతున్నారా.? అయితే అసలు వర్రీ అవ్వకండి.మీ జుట్టు ఎంత పొట్టిగా ఉన్నా కూడా కొద్ది రోజుల్లో పొడుగ్గా మార్చుకోవచ్చు.అందుకు మందారం పువ్వులు( Hibiscus ) ఎంతగానో సహాయపడతాయి.మందార పూలు పూజకు ఉపయోగిస్తారు.కానీ జుట్టు సంరక్షణకు కూడా అవి ఎంతగనో ఉపయోగపడతాయి.
జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు మందారం పువ్వుల్లో మెండుగా ఉంటాయి.మరి ఇంతకీ పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులను ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు మందారం పువ్వులు వేసుకోవాలి.అలాగే అర కప్పు బియ్యం కడిగిన వాటర్,( Rice Water ) రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ మాస్క్ జుట్టు ఎదుగుదలను అద్భుతంగా ప్రోత్సహిస్తుంది.కురులు పొడుగ్గా పెరిగేందుకు దోహదం చేస్తుంది.ఈ రెమెడీని ప్రతివారం ఫాలో అయితే కొద్ది రోజుల్లోనే మీరు రిజల్ట్ ను గమనిస్తారు.
షార్ట్ గా ఉన్న మీ హెయిర్ లాంగ్ గా మరియు థిక్‌గా మారుతుంది.అలాగే ఈ రెమెడీ ద్వారా డ్రై హెయిర్ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.
కురులను సిల్కీగా, షైనీగా మెరిపించుకోవచ్చు.