స్మార్ట్ ఫోన్ కాసేపు ఉపయోగించిన త్వరగా వేడెక్కడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా.అలాంటివారు ఈ టిప్స్ తో చార్జింగ్ వేగాన్ని( Charging Speed ) ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో విడుదల అవుతున్న స్మార్ట్ ఫోన్లు అన్ని ఫాస్ట్ ఛార్జింగ్( Fast Charging ) టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి.దీంతో చార్జింగ్ సమయం చాలా తగ్గింది.
తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్ అవ్వడం కారణంగా ఫోన్ త్వరగా వేడెక్కుతోంది.ఇలా జరిగితే ఫోన్లో త్వరగా చార్జింగ్ అయిపోవడం లేదంటే చార్జింగ్ స్పీడు తగ్గడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
కాబట్టి ఫోన్ కేస్ ను తీసివేసి చార్జింగ్ చేయడం ఉత్తమం.వైర్ లెస్ చార్జర్ ఎక్కువ వెళ్లి ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వైర్ చార్జర్ ను ఉపయోగించడం మంచిది.పాత స్మార్ట్ ఫోన్లు త్వరగా వేడెక్కి అవకాశం చాలా ఎక్కువ.బ్యాటరీ( Battery ) పనితీరు సక్రమంగా లేకుంటే ప్రాసెసర్కు అవసరమైన విద్యుత్ శక్తిని అందించలేదు కాబట్టి ఫోన్ లో కొత్త బ్యాటరీ అమర్చి ఉపయోగించుకోవాలి.
స్మార్ట్ ఫోన్లకు ఎప్పుడు దానికి సంబంధించిన కంపెనీ చార్జర్లను మాత్రమే ఉపయోగించాలి.బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయ్యేంతవరకు ఫోన్ ఉపయోగించకూడదు.ఫోన్ చార్జింగ్ అవుతున్నప్పుడు లేదంటే వినియోగిస్తున్నప్పుడు వేడెక్కితే ఫోన్ కు కాస్త విరామం ఇవ్వాలి.
స్మార్ట్ ఫోన్ పై ఎలాంటి ఒత్తిడి లేకుండా, ముఖ్యంగా ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి.ఒకవేళ ఫోన్ నీటిలో పడడం జరిగితే ఫోన్ నుంచి నీరు బయటకు వచ్చేంతవరకు అస్సలు చార్జింగ్ పెట్టకూడదు.కొంతమంది ఫోన్ చార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడడం లేదంటే ఫోన్ కాల్స్ మాట్లాడడం చేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది.ఇక ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయకూడదు.90 శాతం లేదంటే 95 శాతం చార్జింగ్ అయితే చాలు 100% చార్జింగ్ పెట్టకూడదు.స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే స్మార్ట్ ఫోన్లు రిపేరు కాకుండా ఎక్కువ రోజులు సేవలు అందిస్తాయి.