చినబాబు రాజకీయం.. టీడీపీని ముంచుతుందా? లేపుతుందా?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.అయితే ఆ పార్టీలో చంద్రబాబు తర్వాత ఎవరు అని ప్రశ్నిస్తే ప్రశ్న మిగులుతుందే తప్ప జవాబు దొరకడం లేదు.

 Nara Lokesh Politics Will It Drown Tdp Wakes Up?... Andhra Pradesh, Nara Lokes-TeluguStop.com

తనయుడు లోకేష్‌ను చంద్రబాబు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు.లోకేష్‌కు రాజకీయాలపై పట్టు లేదని ముఖ్యంగా దీర్ఘకాలికంగా పార్టీని నిలబెట్టే ఆలోచన కూడా అసలు లేదని టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు.

మరోవైపు ఏపీలో వైసీపీ మీద ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను లోకేష్ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇస్తే ఏం చేస్తారన్న వాదన కూడా చంద్రబాబులో భయాన్ని రేకెత్తిస్తోంది.

టీడీపీకి సొంతంగా గెలిచే బలం, క్యాడర్ ఉండి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారంటే.పార్టీలో యువ నాయకత్వంపై చంద్రబాబుకు ఉన్న అనుమానాలే కారణమన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఏది ఏమైనా వచ్చే ఎన్నికలకు సంబంధించి సీట్ల పంచాయతీ బాధ్యతలను చంద్రబాబు లోకేష్‌పైనే పెట్టారు.ఈ బాధ్యతల కారణంగానే ఇటీవల మహానాడులో వ‌రుస‌గా మూడుసార్లు పోటీచేసి ఓట‌మిపాలైన‌వారికి ఈ సారి ఎన్నిక‌ల్లో సీటిచ్చేది లేద‌ని లోకేష్ ప్రకటించారనే టాక్ నడుస్తోంది.

అయితే చాలా మంది సీనియర్లు మాత్రం లోకేష్ నయా బాస్ అన్న విషయాన్ని కొంత డైజెస్ట్ చేసుకోలేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.

Telugu Andhra Pradesh, Ap Poltics, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan,

2024 ఎన్నికల్లో టీడీపీని ముంచినా.పైకి లేపినా పూర్తిగా దానికి లోకేష్ కారణమవుతాడని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.త్వరలో నారా లోకేష్ పాదయాత్ర చేపట్టే ఆలోచన కూడా చేస్తున్నారు.

ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల్లోకి వెళ్లడం ముఖ్యం కాబట్టి లోకేష్ పాద‌యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.అయితే లోకేష్ తన పాదయాత్ర ఎప్ప‌టి నుంచి ప్రారంభిస్తారు.ప్రారంభిస్తే ఎక్క‌డ నుంచి ప్రారంభిస్తారు అనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి.అన్నీ అనుకూలిస్తే గాంధీ జ‌యంతి రోజున అంటే అక్టోబ‌ర్ 2న లోకేష్ త‌న పాద‌యాత్రను ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube