ఫార్మ్ లేకపోవడం , ప్లాపులు కొట్టడం ఎంతటి సూపర్ స్టార్ నైనా ఫేం కోల్పోయేలా చేస్తుంది.ప్రాస్తుతం రజినీకాంత్ పరిస్థితి అలాగే ఉంది.
వరసగా ప్లాపులు పడగా రజినీకాంత్ ఇప్పుడు కబాలి సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.
ఆయన ముందరి సినిమాలు కొచ్చాడియన్, లింగా అపజాయాలు రజినికి తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
సినిమా విజయం సాధించిందా లేక అపజయ పాలైందా అనేది పక్కన పెడితే రజిని సినిమా కూడా గొడవల మూకలతో విడుదలయ్యే పరిస్థితి వచ్చింది.ప్రస్తుతం తీస్తున్న కబాలి తో ఆ గొడవలు అన్నీసర్దుమనిగేలా చెయ్యాలి అనేది ఆయన కోరిక.
మరొక పక్క రోబో సీక్వెల్ ల పనిలో కూడా బిజీ గా ఉన్నారు ఆయన.మొన్నటిదాకా మలేషియాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు చెన్నైకు షిఫ్ట్ అయ్యింది.తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్న ఈ సినిమా తమిళ టైటిల్ కబాలి కాగా తెలుగు టైటిల్ మహాదేవగా ప్రచారం చేశారు.తెలుగు లో కూడా రాబోతున్న ఈ సినిమాకి తెలుగులో కూడా ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసారు అని తెలుస్త్హోంది.
చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా కి తెలుగు లో కూడా పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం.







