కన్ఫ్యూజన్ లో చిరంజీవి - బాలకృష్ణా

మిక్స్ టాక్ వచ్చినా కూడా బాలయ్యబాబు డిక్టేటర్ సినిమా పరవాలేదు అనే కలక్షన్ లతో సాగుతోంది.ఇది బాలయ్య 99 వ చిత్రం , కాగా ఆయన 100 వ చిత్రం సింగీతం శ్రీనివాసరావు తో చెయ్యబోతున్నారు అని టాక్ నడుస్తోంది.

 Balakrishna And Chiru Are In Confusion-TeluguStop.com

దాదాపు అధికారికంగా ఓకే అయిపోయినట్టే.

లెజెండ్ , సింహా లాంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన బోయపాటి ని పక్కకి పెట్టి సింగీతం కి ఛాన్స్ ఇవ్వడం ఆశ్చర్యపరిచే విషయం.

చిరంజీవి కూడా నూట యాభయ్యవ చిత్రం విషయం లో ఇప్పటి వరకూ సరైన నిర్ణయం తీస్కోలేక పోతున్నారు అలాగే బాలయ్య కూడా 100 వ చిత్రo అత్యంత ప్రతిష్టాత్మకం కావడం తో కొత్త డైరెక్టర్ తో చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా పరిశీలిస్తున్నారు అని చెబుతున్నారు.పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్ర తన ఫస్ట్‌ మూవీ బాలకృష్ణతో చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్నాడట.

ఇప్పటికే రవీంద్ర ఒక జానపద కథను బాలకృష్ణకు వినిపించాడు.భారీ బడ్జెట్‌తో, భారీ గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాల్సి వుంటుంది.

మరి 100వ సినిమాని జానపద సినిమాగా బాలయ్య చేస్తాడా? లేదా? అనేది తెలియాల్సి వుంది.బాలకృష్ణ ఏం చెబుతాడా? అని రవీంద్ర ఎదురుచూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube