వరల్డ్ వైడ్ గా నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.విడుదల అయ్యింది తక్కువ థియేటర్ లలోనే కానీ ఈ సినిమా మాత్రం సంక్రాంతి కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అంటున్నారు విశ్లేషకులు.
ఎన్నడూ లేనంతగా నాగార్జున కెరీర్ లోనే పెద్ద రికార్డులు బద్దలుకోడుతోంది ఈ సినిమా.
ఈ విషయం లో నిర్మాత పీవీపీ చాలా హ్యాపీగా ఉన్నారట.
నాగార్జున తదుపరి చిత్రం ఊపిరి ఆయన బ్యానర్ లోనే చెయ్యడం వలన ఆయన ఇంత ఆసక్తి చూపిస్తున్నారు అని తెలిస్తోంది.నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి నిర్మిస్తున్న మల్టీస్టారర్ ‘ఊపిరి’ చిత్రాన్ని మార్చి 25న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసాడు పివిపి.
సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సోగ్గాడే.’ హిట్ అవ్వడంతో అది తన సినిమాకి ఎంతో హెల్ప్ అవుతుంది.
అందుకే పివిపి ‘సోగ్గాడే.’ సినిమాని అంతగా ఎత్తేస్తున్నాడు.
వీల్ ఛైర్‌లో సినిమా అంతా కనిపించే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాడు నాగార్జున.సోగ్గాడు హిట్ తో ఊపిరి కి బయ్యర్ లు అడ్వాన్సుల మీద అడ్వాన్సులు ఇస్తూ ఉండడం పీవీపీ కి సంతోషకరమైన విషయం.
అన్నట్టు పీవీపీ పవన్ కళ్యాణ్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ తెలిసిన విషయమే.
.






