భార్యా భర్తల మధ్య గొడవలూ – అనుమానం ఒక చిన్న బిడ్డ ప్రాణాన్ని తీసాయి.ఒక వ్యక్తి తన భర్త మీద పెట్టుకున్న అనుమానం ఇంతటి అమానుషానికి దారి తీస్తుంది అని అతను కూడా ఊహించి ఉండడు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో కొంత కాలంగా భార్యను అనుమానిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు సాయిలు అనే ఒక వ్యక్తి.ఒక రోజు భార్య మీద కోపంతో పిల్లలని తీవ్రంగా కొట్టాడు, ఆ తోపులాట లో కొడుకునీ కూతురు నీ గోడకేసి కొట్టాడు ఆ దెబ్బతో కూతురు తీవ్రంగా గాయపడి కింద పడిపోయా కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇది జరగడానికి వారం ముందరే భార్య తో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయినా సాయిలు మళ్ళీ ఆమెతో సరిగ్గా ఉంటాను అంటూ తనలో మార్పు వచ్చిందంటూ భార్యా, ముగ్గురు పిల్లలను అత్తగారిని ఒప్పించి పండక్కు ఇంటికి తీసుకెళ్లిన సాయిలు భార్యను వేధించడం మాత్రం ఆపలేదు.పిల్లలు తనకు పుట్టలేదంటూ అనుమానించేవాడు.
సాయంత్రం కూడా భార్య ఇంట్లో లేని సమయంలో చిన్న కొడుకు సంపత్, కూతురు పావనిలను గోడకేసి కొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.సంపత్ ని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మధ్యలోనే ప్రాణం విడిచాడు.







