సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కృష్ణా జిల్లా పోలీసులు. సంక్రాంతి సంబరాల్లో డాన్సులు చేసిన పోలీసులు.
అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు.సంక్రాంతి సంబరాలు వారం రోజుల ముందే ఘనంగా నిర్వహించారు కృష్ణాజిల్లా పోలీసులు.
కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు రెండు రోజుల ముందే అంబరాన్ని అంటయి.హిందువుల పండుగలలో ప్రాచుర్యం పొందిన సంక్రాంతి సంబరాలను అలనాటి సంవత్సరాలను మైమరిపించే విధంగా డిఎస్పీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఎస్ ఐ లు ఇతర అధికారులు నిత్యం పోలీసు యూనిఫామ్ తో కనిపించే వారు సాంప్రదాయ దుస్తులలో అలరించడం విశేషం.
నిత్యం ఉద్యోగ వత్తిడిలో ఉండే పోలీసులు ఒక్కసారిగా ఆటవిడుపు లభించింది.భోగిమంటలతో, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల భోగి పళ్ళ సంభరలతో, పొట్టేళ్ల విన్యాసాలతో, కోలాట ప్రదర్శనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి.చిన్నారుల్లో యువతీయువకులు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతూ ఆనందాన్ని పొందారు.కృష్ణా జిల్లా ఎస్ పి జాషువా సతీసమేతంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు.
వ్యాఖ్యాతగా డి.ఎస్.పి మాసుం భాష తన వాక్చాతుర్యంతో ఆహుతులను ఆకట్టుకున్నారు.కొత్త అల్లుళ్ళు కొంటె మరదలా డ్రామా చూపరులను ఆకట్టుకున్నది.
ఈ కార్యక్రమంలో ఏ యస్పి వెంకట రామాంజనేయులు,డీఎస్పీలు గుడివాడ సత్యానంద్, అవనిగడ్డ మహబూబ్ బాషా, గన్నవరం డి ఎస్ పి విజయ పాల్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు తులసి,శివాజీ, కొండయ్య, రవికుమార్, శ్రీనివాస్, వీరయ్య గౌడ్, ఎస్సై కళ్యాణి, హిమ బిందు, పద్మ,నాగరాజు, జనార్దన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.