చదరంగపు నయా చాంపియన్ ప్రజ్ఞానంద!

మేధావులు ఆటగా పరిగణించబడే చదరంగంలో( Chess ) చైనా, రష్యా , అమెరికాలు ఎప్పుడూ ముందంజలో ఉంటూ ఉంటాయి.అలాంటి దేశాలను ఢీ కొట్టి ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్న ఘనత భారతదేశం నుంచి విశ్వనాదన్ ఆనంద్ కు( Viswanathan Anand ) మాత్రమే దక్కింది.

 Chess World Cup 2023 Praggnanandhaa Magnus Carlsen To Play Tie-breaker To Decide-TeluguStop.com

దాదాపు పది సంవత్సరాల పాటు విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చదరంగ సామ్రాజ్యాన్ని శాసించాడు.అయితే నార్వేకి చెందిన కార్ల్ సన్( Carlsen ) అతిపిన్న వయసులోనే ప్రపంచ చెస్ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా వెలిగాడు.

ప్రతి విజయానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నట్టుగా విశ్వనాథన్ ఆనంద్ హవా కి ముగింపు పలికి సరికొత్త లీడర్ గా అవతరించాడు.

Telugu Chess, Chess Game, Chess Cup, India, Magnus Carlsen, Praggnanandhaa, Tie

గత పది సంవత్సరాలుగా తిరుగులేని మహారాజుగా ప్రపంచ చదరంగ సామ్రాజ్యాన్ని ఏలుతున్న కార్ల్ సన్ సరైన పోటీ లేకపోవడంతో తనకు చదరంగంపై ఆసక్తి కూడా కలవడం లేదంటూ ప్రకటించాడు.అయితే ఇప్పుడు అతని శకానికి ముగింపు పలికి నయా చక్రవర్తిగా మరో యువకెరటం ముందుకు వచ్చింది.భారత చదరంగ రాజధానిగా వెలిగే తమిళనాడులోని 18 ఏళ్ల ప్రజ్ఞానంద్( Praggnanandhaa ) ఇప్పుడు భారత చెస్ సామ్రాజ్యానికి పెద్దదిక్కుగా మారాడు.

ఇప్పటికే అమెరికా దిగ్గజా ఆటగాడు కారుహనా ఓడించిన ప్రజ్ఞానంద ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ రౌండ్ లో అడుగుపెటిన రెండవ బారత ఆటగాడిగా పేరు గడించాడు.

Telugu Chess, Chess Game, Chess Cup, India, Magnus Carlsen, Praggnanandhaa, Tie

ఆన్లైన్ రాపిడ్ చెస్ లో ఇప్పటికే రెండుసార్లు కార్ల్ సన్ ను ఓడించిన ప్రజ్ఞానంద ఇప్పుడు మరొకసారి అంతర్జాతీయ ప్రపంచకప్( Chess World Cup ) వంటి ప్రతిష్టాత్మక టోర్నీ లో అతనితో తలపడుతున్నాడు.రెండు రౌండ్ లను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద గురువారం జరిగే ట్రై బ్రేకర్ రౌండ్లో గెలిస్తే సరికొత్త రికార్డులు నెలకొల్పిన వాడు అవుతాడు.ఈ కాంపిటీషన్ లో గనక తన విజేత అయితే అతి చిన్న వయసులో ఈ ఘనత సాదించిన రెండో వ్యక్తిగా పేరు పొందుతాడు.

ఆల్ ది బెస్ట్ లిటీల్ గ్రాండ్ మాస్టర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube