మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.ఉపఎన్నికకు 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
అర్బన్ పరిధిలో 35, రూరల్ పరిధిలో 263 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మునుగోడులో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారని, 5,686 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం 739 మంది మాత్రమే దరఖాస్తు చేశారని తెలిపారు.ఆన్ లైన్ లోనూ ఓటర్ స్లిప్పులు అందుబాటులో ఉన్నాయన్నారు.
అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు ముగ్గురు ఆఫీసర్లు ఉంటారని పేర్కొన్నారు.1192 మంది సిబ్బంది అవసరమన్న ఆయన 300 మందిని అదనంగా ఉంచామని చెప్పారు.ఈ ఉపఎన్నిక పోలింగ్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని వెల్లడించారు.మునుగోడులో ఓటర్లకు మొదటి సారి కొత్త రకం ఐడీ కార్డులను జారీ చేస్తున్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు.







