న్యూస్ రౌండప్ టాప్ 20

1.కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో టిఆర్ఎస్ కు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది.జిల్లాలో టిఆర్ఎస్ కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ రాజ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం కెసిఆర్ కు నోటీసులు జారీ చేసింది. 

2.రాజధాని పై విజయ సాయి రెడ్డి కామెంట్స్

  ఎవరు అవునన్నా కాదన్నా విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 

3.భారత్ లో కరోనా

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

4.తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఇంట్లో ఎన్.ఐ.ఏ సోదాలు

  తెలంగాణ హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహించారు.విశాఖలో మూడేళ్లుగా కనిపించకుండా పోయిన రాధా అనే నర్సింగ్ విద్యార్థిని ని నక్సల్స్ లో చేర్చారని శిల్ప పై అభియోగాలు ఉన్నాయి. 

5.అస్సాంలో వరదల బీభత్సం

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

అస్సాం లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఇప్పటి వరకు 100 మందికి పైగా మరణించారు. 

6.75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి

  75 శాతం హాజరు ఉన్న వారికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 

7.మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కోవిడ్

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాస్ కు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 

8.రేపు బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు

  బిజెపి రాష్ట్ర పతి అభ్యర్థిగా ప్రకటించిన ద్రౌపది ముర్ము ఢిల్లీకి చేరుకున్నారు.రేపు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

9.శ్రీకాకుళం కేంద్రంగా అమ్మ ఒడి మూడో విడత

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

ఏపీ సీఎం జగన్ ఈ నెల 27న శ్రీకాకుళం రానున్నారు ఈ సందర్భంగా మూడో విడత అమ్మ ఒడి పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తారు. 

10.ప్రగతి భవన్ ముట్టడికి జీహెచ్ఎంసీ కార్మికులు పిలుపు

  ప్రగతి భవన్ ముట్టడికి జీహెచ్ఎంసీ కార్మికులు పిలుపునిచ్చారు. 

11.పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య చర్చలు

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

ఓ సినీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ , సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా సమావేశమై అనేక అంశాలపై చర్చించారు. 

12.కే టి ఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు…

  బలవంతంగా భూమిని గుంజుకోడం, పక్క రైతుపై లాఠీల దాడి చేయించడం వంటి వాటిని అభివృద్ధి అంటారా అంటూ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. 

13.జనసేనకు ఆదరణ పెరుగుతోంది : పోతిన

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

జనసేన పార్టీకి రోజురోజుకు జనాల్లో ఆదరణ పెరుగుతోందని , అభిమానులు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆ పార్టీ నేత మహేష్ అన్నారు. 

14.జగన్ పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

  ఏపీ సీఎం జగన్ రెడ్డి ది సిగ్గులేని జన్మ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 

15.ట్విట్టర్ అక్షరాల పరిమితి పెంపు

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

ట్విట్టర్ లో అక్షరాల పరిమితిని 280 నుంచి 2500 కు పెంచాలని నిర్ణయించారు. 

16.విశ్వక్ సేన్ సినిమా కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్

  ప్రముఖ హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరో గా, నిర్మించబోతున్న సినిమాకు సినీ హీరో పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. 

17.అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉద్యోగాలు

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని  ఇనగలూరు లో  రూ.700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు ఏపీ సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు.ఈ పరిశ్రమ ఏర్పాటు తో 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని జగన్ తెలిపారు. 

18.కాంగ్రెస్ లో చేరిన పీజేఆర్ కూతురు

  పీజేఆర్ కుమార్తె టిఆర్ఎస్ కార్పొరేటర్ విజయ రెడ్డి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. 

19.ఏపీలో దుల్హాన్ పథకం నిలిపివేత

Telugu Apcm, Avanthisrinivas, Cm Kcr, Corona, Droupadi Murmu, Ghmc, Lokesh, Pawa

ఏపీలో దుల్హన్ పథకం ను నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,650
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51, 990

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube