తెరపైకి మరోకొత్త సిక్సర్ల రారాజు..!

క్రికెట్ ఫార్మాట్లలో టీ20 వచ్చిందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు.టీ20ల్లో సిక్సులు వర్షం కురుస్తుంది.ఫోర్లను బాదుతూ బ్యాట్స్మెన్లు విరుచుకుపడతారు.ఇటువంటి మ్యాచుల్లో బ్యాట్స్మెన్లు తమ బ్యాట్లకు పదును పెడుతారు.అభిమానుల కోలాహలం మధ్య తమ దూకుడుతనాన్ని ప్రదర్శిస్తారు.తాజాగా ఈ ఫార్మాట్‌ లో ఓ కొత్త ఆటగాడు సిక్సర్ల రారాజుగా పేరుపొందాడు.

 New Zealand Cricketer Glenn Philips Emerging As Star Batsman With 89 Sixers, Spo-TeluguStop.com

ఇప్పటి వరకూ సిక్సర్ల రారాజుగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, మ్యాక్స్‌వెల్ లాంటివాళ్లు ఉండేవాల్లు.వాళ్లందరినీ ఓ యువ క్రికెటర్ పక్కన పెట్టి సిక్సర్ల రారాజుగా కీర్తి పొందాడు.24 ఏళ్ల యువ బ్యాట్స్మెన్ తన సత్తాను టీ20ల్లో నిలుపుకున్నాడు.న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్.

వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అయిన ఫిలిప్స్ ఈ సంవత్సరంలో ఎక్కువ సిక్సులు కొట్టిన వ్యక్తిగా అతను రికార్డు నెలకొల్పాడు.ఓ కాన్ఫరెన్స్ లో గ్లెన్ ఫిలిప్స్ మాట్లాడుతూ.

జిమ్ చేయడం వల్లనే సిక్సులు ఎక్కువగా కొట్టినట్లు చెప్పుకొచ్చాడు.జిమ్‌ లో చేసిన కృషి ఫలితంగా తాను ఎంతో ఫిట్ గా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.

గ్లెన్ ఫిలిప్స్ 2021వ సంవత్సరంలో మొత్తంగా చూస్తే 89 సిక్సర్లు కొట్టి రికార్డు నెలకొల్పాడు.అతడు 48 మ్యాచ్ ల్లోనే ఈ రికార్డును నెలకొల్పడం విశేషం.అదేవిధంగా 48 ఇన్నింగ్స్‌ లో ఫిలిప్స్ పేరిట 9 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.

Telugu Sixers, Batsman, Latest, Teams, Ups-Latest News - Telugu

అతని తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టన్ 82 సిక్సర్లతో నిలిచాడు.ఇకపోతే 9 మ్యాచ్‌ ల్లోనే 75 సిక్సర్లు కొట్టిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ సంవత్సరం వెస్టిండీస్ క్రికెటర్ అయిన ఆండ్రీ రస్సెల్ ఇప్పటి దాకా కూడా 50 సిక్సర్లు కొట్టాడు.

గేల్ 41 సిక్సర్లు బాదాడు.అలాగే మ్యాక్స్‌వెల్ 35 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు.

అయితే ఈ సంవత్సరం వీల్లందరూ టీ20 మ్యాచ్‌ లు తక్కువగా ఆడటం వల్లే ఫిలిప్స్ ఆ రికార్డును నెలకొల్పగలిగాడు.ఫిలిప్స్ ఎక్కువగా టీ20లు ఆడటంతో ఎక్కువ సిక్సులు కొట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube