ఫోన్ లో గట్టిగా మాట్లాడుతున్నావంటూ పెట్రోల్ తో దాడి... ఇదెక్కడి దారుణం రా అయ్యా.. petrol, phone

నేటి సమాజంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి.పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా నేరాల ప్రవృత్తిని కొంత మంది మార్చుకోవడం లేదు.

 Attack With Petrol As If Talking Loudly On The Phone .. Did This Get Worse .. At-TeluguStop.com

ఈ నేరాలు ఇంతలా పెరిగిపోవడానికి మద్యం కూడా ఒక కారణమవుతోంది.మద్యం ప్రభావం వలన కూడా నేరాలు పెరుగుతూ పోతున్నాయి.

తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలంలో జరిగిన ఘటన గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వకుండా ఉండలేరు.ఫోన్ లో గట్టిగా మాట్లాడుతున్నాడనే కారణంతో అవతలి వ్యక్తులు ఒక వ్యక్తి ముఖం మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఈ ఘటనలో బాధితుడి మొహానికి చాలా గాయాలయ్యాయి.అతడిని పోలీసులు, స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించారు.

నిందితులతో పాటుగా బాధితుడు కూడా మద్యం తాగే సమయంలోనే ఈ ఘటన జరగడం మద్యం వలన ఎటువంటి అనర్థాలు జరుగాయో.అద్దం పడుతోంది.

నరసింహ అనే వ్యక్తి పాత బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.నరసింహకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఉన్నదాంట్లోనే నరసింహ తన బతుకు బండిని లాగుతున్నాడు.ఇటువంటి తరుణంలో నరసింహ ఓ రోజు ఓ ప్రదేశంలో కూర్చుని మద్యం సేవిస్తున్నాడు.

అతడికి దగ్గర్లోనే మరికొంత మంది వ్యక్తులు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు.ఈ సమయంలో నరసింహకు ఒక ఫోన్ వచ్చింది.

దీంతో ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడసాగాడు.అది అవతలి బ్యాచ్ లో ఉన్న వ్యక్తులకు నచ్చలేదు.

ఫోన్ గట్టిగా మాట్లాడుతున్నావని కోపంతో ఊగిపోతూ నరసింహ ముఖం మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు.ముఖం నిండా గాయాలతో ఉన్న నరసింహను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇలా నరసింహ ముఖం మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సంజీవ రెడ్డి తెలియజేశారు.మెరుగైన చికిత్స కోసం నరసింహను కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించామని కూడా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube