సినిమా రంగం జూదం లాంటిది.కొన్ని సార్లు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది.మరికొన్ని సార్లు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.దర్శకులు, నిర్మాతలు, హీరోలు చేసే సినిమాల్లో కొన్ని ఫ్లాప్ అయినా.మిగతావి హిట్ అవుతాయి.విజయ పరాజయాలు కామన్.
కానీ కొన్ని సినిమాలు ఆయా దర్శకులను కోలుకోలేని దెబ్బకొట్టాయి.ఇంతకీ ఆ సినిమాలేంటో? ఆ దర్శకులు ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.
కరుణాకరణ్రామ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా కరుణాకరణ్ తీసిన సినిమా ఎందుకంటే ప్రేమంట.ఈ సినిమా ఘోర పరాజయం పొంది.తన కెరీర్ కు పెద్ద అవరోధంగా మారింది.
బివిఎస్ రవి
జవాన్ సినిమాను తెరకెక్కించిన రవి.ఆ సినిమా డిజాస్టర్ కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు.గోపీచంద్ వాంటెడ్ సినిమాతో రవి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
దశరథ్
దశరథ్ అంటేనే యావరేజ్ హిట్ డైరెక్టర్ అనే పేరుంది.ఆకీన నాగార్జున, నయనతార జంటగా నటించిన గ్రీకు వీరుడు మూవీ ఫ్లాపై.గట్టి దెబ్బకొట్టింది.
క్రాంతి మాధవ్
క్రాంతి మాధవ్ చక్కటి కథలతో ఎన్నో సినిమాలు తీశాడు.ఓనమాలు లాంటి అద్భుత మూవీని తెరకెక్కించాడు.కానీ విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి తీసిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది.
మెహర్ రమేష్
పలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన రమేష్ కు ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా గట్టి దెబ్బకొట్టింది.
సతీష్ వేగ్నేష్
శతమానంభవతి లాంటి మంచి ఫ్యామిలీ సినిమాలు తీసిన సతీష్ ను.నితిన్ హీరోగా పెట్టి తీసిన శ్రీనివాస కల్యాణం సినిమాతో ఎదురు దెబ్బ తిన్నాడు.
శ్రీను వైట్ల
టాప్ డైరెక్టటర్ శ్రీను వైట్లకు మహేష్ బాబు ఆగడు సినిమా కెరీర్ లో కోలుకోలేని దెబ్బ కొట్టింది.
శ్రీకాంత్ అడ్డాల
మహేష్ బాబు బ్రహ్మోత్సం సినిమా శ్రీకాంత్ అడ్డాలను అడ్డంగా బుక్ చేసింది.
వివి వినాయక్
మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వినాయక్ ను సాయి ధరమ్ తేజ్ తో తీసిన ఇంటెలిజెంట్ సినిమా గట్టి దెబ్బ కొట్టింది.
బోయపాటి శ్రీను
యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటిని.రాంచరణ్ హీరోగా చేసిన వినయ విధేయ రామ కోలుకోలేదని దెబ్బ తీసింది.