ఇప్పుడంటే హీరోయిన్లు సినిమాల్లో ఏం చేయమన్నా చేస్తున్నారు.ఎంత ఎక్కువ స్కిన్ షో చేస్తే అన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.
అంగాంగ ప్రదర్శనకు ఏమాత్రం వెనుకాడటం లేదు.మరికొంత మంది హీరోయిన్లు అయితే తెరమీద నగ్నంగా నటించమన్నా.
నటిస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.ముద్దు సీన్లు, పొట్టి బట్టలు కామన్ అయ్యాయి.గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.కథ ప్రధానంగా సినిమాలు ఉండేవి.ఎవరూ మోతాదుకు మించి ప్రవర్తించేవారు కాదు.స్కిన్ షో అనే మాటే ఉండేది కాదు.
రేర్ గా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే వారు.అది కూడా పరిమితులకు లోబడే చేసేవారు.
కానీ దేవికా రాణి అనే తెలుగు హీరోయిన్ 1933లోనే హాట్ సీన్ లో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది.అప్పట్లోనే నాలుగు నిమిషాల ముద్దు సీన్ లో నటించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది.
అప్పట్లో ఈ సీన్ పై పత్రికల్లో, జనాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.ఇంతకీ ఈ దేవికా రాణి ఎవరు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ అంతా చూడాల్సిందే!
దేవికా రాణి విశాఖపట్నంలో పుట్టింది.అనంతరం లండన్ కు వెళ్లింది.రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది.
జర్మనీలో నిర్మాతగా పేరు పొందిన హిమాంశు రాయ్ ని ప్రేమించి 1929లో పెళ్లి చేసుకుంది.వివాహం అనంతరం ఇండియాకు తిరిగి వచ్చారు.ఇక్కడికి వచ్చాక ఇద్దరు కలిసి కర్మ అనే సినిమా తీశారు.తన భర్త హిమాంశు హీరోగా తను హీరోయిన్ గా చేసింది.
ఈ సినిమాలో దాదాపుగా 4 నిమిషాలు ముద్దుపెట్టుకునే సీన్ లో నటించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇదే తొలి కిస్ సీన్ కావడం విశేషం.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టిన తొలిసారే దేవికా రాణికి ఇవ్వడం విశేషం.