అవును మేము చెత్త సినిమాలు తీసాం అంటున్న స్టార్ హీరోలు

సినిమాలు హిట్ కావాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తారు.ఆడియో రిలీజ్ అనీ, ప్రీరిలిజ్ అని ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తారు.

 Tollywood Heroes Who Accepted Their Movie Is Worst,junior Ntr, Raviteja, Ram Pot-TeluguStop.com

సినిమా విడుద‌ల‌కు ముందు టీవీ స్టూడియోల‌కు వెళ్లి.ఈ సినిమా న‌భూతో న‌భ‌విష్య‌త్ అని చెప్తారు.

ఒక‌వేళ సినిమా విజ‌యం సాధిస్తే.స‌క్సెస్ మీట్లంటూ నానా హ‌డావిడి చేస్తారు.

హీరోలు, ద‌ర్శ‌కులు, హీరోయిన్ల‌తో ఇంట‌ర్వ్యూల మీద ఇంట‌ర్వ్యూలు ఇప్పిస్తారు.

ఒక‌వేళ సినిమా ప‌రాజ‌యం పాలైతే మాత్రం ఎవ్వ‌రూ మాట్లాడ‌రు.

మాట్లాడినా మూవీ టీం బాధ‌ప‌డుతుంద‌ని సైలెంట్ అవుతారు.అందుకే ఫ్లాప్ అయిన సినిమా గురించి ఎక్క‌డా చ‌ర్చ‌లు ఉండ‌వు.

కానీ కొంద‌రు హీరోలు ఇందుకు మిన‌హాయింపు.త‌మ సినిమాలు ఫ్లాప్ అయ్యాయ‌ని స్వ‌యంగా తామే ఒప్పుకున్నారు.ఇంత‌కీ ఆహీరోలు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌వ‌న్ క‌ల్యాణ్

Telugu Heroes, Ntr, Ram Pothineni, Raviteja-Telugu Stop Exclusive Top Stories

త‌న క‌రెర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నో సినిమాలు చేశాడు.వాటిలో చాలా మూవీస్ హిట్ అయ్యాయి.మ‌రికొన్ని ఫ్లాప్ అయ్యాయి.అయితే స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, జానీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయ‌ని ప‌వ‌న్ స్వ‌యంగా చెప్ప‌డం విశేషం.

మ‌హేష్ బాబు

Telugu Heroes, Ntr, Ram Pothineni, Raviteja-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్ కూడా త‌ను న‌టించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయ‌ని చెప్పాడు.శ్రీ‌మంతుడు ఆడియో ఫంక్ష‌న్ లో సైనికుడు, ఆగ‌డు సినిమాలు నిరాశ ప‌రిచిన‌ట్లు వెల్ల‌డించాడు.

నాని

Telugu Heroes, Ntr, Ram Pothineni, Raviteja-Telugu Stop Exclusive Top Stories

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ప్లాప్ అయ్యింది.డిజిట‌ల్ స్ట్రీమింగ్ సంస్థ ఇదో మంచి సినిమా అంటూ ప్ర‌మోట్ చేస్తే.సినిమా స‌రిగా ఆడ‌లేద‌ని నాని ట్వీట్ చేయ‌డం విశేషం.

నాగార్జున‌

Telugu Heroes, Ntr, Ram Pothineni, Raviteja-Telugu Stop Exclusive Top Stories

రామ్ గోపాల్ వ‌ర్మ‌, నాగార్జున కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా ఆఫీస‌ర్.ఈ సినిమా డిజార్ట్ గా మిగిలింద‌ని స్వ‌యంగా నాగార్జునే సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు.

జూ.ఎన్టీఆర్

Telugu Heroes, Ntr, Ram Pothineni, Raviteja-Telugu Stop Exclusive Top Stories

టెంప‌ర్ ఆడియో రిలీజ్ వేడుక‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ త‌న గ‌త సినిమాలు అంత‌గా ఆడ‌లేద‌ని చెప్పాడు.ముందు ముందు వ‌చ్చే సినిమాలు బాగుంటాయ‌న్నాడు.కానీ ఏ సినిమాలు బాలేవు అని మాత్రం చెప్ప‌లేదు.

రామ్

Telugu Heroes, Ntr, Ram Pothineni, Raviteja-Telugu Stop Exclusive Top Stories

తాను న‌టించిన జ‌గ‌డం సినిమా ఘోర ప‌రాభ‌వం పొందింద‌ని రామ్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

ర‌వితేజ‌

Telugu Heroes, Ntr, Ram Pothineni, Raviteja-Telugu Stop Exclusive Top Stories

ఎన్ని హిట్ మూవీలు చేసిన ర‌వితేజ.త‌ను న‌టించిన‌ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయ‌ని ప్ర‌క‌టించాడు.అవి ఒక‌టి నిప్పు కాగా.

మ‌రొక‌టి దేవుడు చేసిన మ‌నుషులు అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube