ప్రపంచంలోనే అతి పెద్ద అక్వేరియం పగిలిపోయింది... వైరల్ అవుతున్న ఫొటోలు!

సాధారణంగా మనం చిన్న చిన్న ఫిష్ అక్వేరియంలను చూస్తేనే తేరిపారా అలా చూస్తూ ఉండిపోతాం.అలాంటిది మనుషులు పట్టేంత అత్యంత పెద్ద అక్వేరియం లాంటివి కనిపిస్తే వాటిని చూసి బిత్తరబోవలసిందే కదా.అయితే అది ప్ర‌పంచంలోని భారీ అక్వేరియం.46 అడుగుల ఎత్తుతో సిలిండ‌ర్ ఆకారంలో ఉండే ఇందులో 1500కు పైగా చాలా అరుదైన చేప‌లు జీవిస్తున్నాయి.సంద‌ర్శ‌కులకు వినోదాన్ని పంచిన ఆ అక్వేరియం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా బ‌ద్ధ‌లైంది.అవును, ఈ సంఘ‌ట‌న‌ బెర్లిన్‌లో శుక్ర‌వారం జ‌రిగింది.

 The World's Largest Aquarium Has Burst Photos Are Going Viral ,aquarium , World-TeluguStop.com

అక్క‌డి లీజ‌ర్ కాంప్లెక్స్‌లోని కొలువై వున్న “డోమ్ అక్వేరియం” ఉన్నట్టుండి ముక్కలైపోయింది.దాంతో అందులోని 10 ల‌క్ష‌ల‌ లీట‌ర్ల నీళ్లు రోడ్డు మీద‌కు వరదలాగా వ‌చ్చాయి.

అక్వేరియం గాజు ముక్క‌లు అయితే హోట‌ల్ కాంప్లెక్స్‌, రోడ్డు మీద చెల్లా చెదురుగా ప‌డ్డాయి.దాంతో వంద మంది స‌హాయ బృందాలు అక్క‌డికి చేరుకున్నాయి.

అయితే ఈ భారీ అక్వేరియం ముక్క‌లు కావ‌డానికి కార‌ణం ఏంట‌నేది ఇంకా తెలియ‌లేదు.ఆ స‌మ‌యంలో దాదాపు 350 మంది హోట‌ల్‌లో ఉన్నారని సమాచారం.

కాగా వాళ్ల‌ను వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని పోలీసులు ఆదేశించారు.

Telugu Aquarium, Aquarium Broken, Berlin, Dome Aquarium, Fish Aquarium, Worldsbi

ప్రస్తుతం స‌హాయ‌క సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ల‌డానికి య‌త్నిస్తున్నారు.కానీ అక్కడ గాజు ముక్క‌లు భారీ స్థాయిలో పేరుకుపోవ‌డంతో సాధ్యం కావ‌డంలేద‌ని ఒక అధికారి స్థానిక మీడియా ద్వారా తెలిపారు.ప్రస్తుతం హోట‌ల్‌లోని వాళ్ల‌ను త‌ర‌లించేందుకు బ‌స్సులు ఏర్పాటు చేశారు.

ఎందుకంటే.ప్ర‌స్తుతం బెర్లిన్‌లో ఉష్ణోగ్ర‌త మైన‌స్ 7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది.

బెర్లిన్‌లోని లీజ‌ర్ కాంప్లెక్స్‌లో రాడిస‌న్ హోట‌ల్, మ్యూజియం, షాపులు, రెస్టారెంట్ ఉన్నాయి.వాటన్నింటిలో డోమ్ అక్వారే స్పెష‌ల్ అట్రాక్ష‌న్.

దీని మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే.ఇందులో లిఫ్ట్ ఉంటుంది.

సంద‌ర్శ‌కులు లిఫ్ట్‌లో ఎక్కి అరుదైన చేప‌ల్ని చూసి ఆనందించేవాళ్ళు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube