ఈ మధ్యకాలంలో కూడా మతాల మధ్య, కులాల మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.చదువుకున్న వాళ్లతో పాటు మంచి హోదాలో ఉన్న వాళ్ళు కూడా కులం, మతం అంటూ వేరువేరుగా చూస్తున్నారు.
సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం మార్పు అనేది చాలా తక్కువగా ఉంది.ఎక్కడో కొంతమంది మాత్రమే అందరం ఒకటే అనే భావనతో ఉంటున్నారు.
అందులో కొందరు సామాన్యులు. మరికొందరు సెలబ్రెటీలు కూడా.
ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు కూడా అంతా ఒకటే అన్నట్లుగా కనిపిస్తున్నారు.తాజాగా ఓ స్టార్ సెలబ్రెటీ కిడ్ అంతా ఒక్కటే అన్నట్లుగా ఒక పోస్ట్ షేర్ చేసింది.
నిజానికి తాను చిన్నవయసులో ఉన్నప్పటికీ కూడా తనలో కూడా అంతా ఒకటే అన్న భావన మాత్రం అందర్నీ ఫిదా చేసింది.ఇంతకు ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు మహేష్ బాబు కూతురు సితార.
మామూలుగా మహేష్ బాబు హీరో జీవితాన్ని పక్కకు పెడితే ఆయన వ్యక్తిగత మనస్తత్వం మాత్రం చాలా అందమైనది.
వ్యక్తిగతంగా మహేష్ బాబుకు మంచి పేరు, పలుకుబడి ఉంది.ఎంతోమందికి సహాయం చేస్తూ అందరూ ఒకటే అన్న భావనతో ఉంటాడు మహేష్.కేవలం తనే కాకుండా తన కుటుంబాన్ని కూడా అదే దారిలో నడిపిస్తూ ఉంటాడు.
అందుకే తన వారసులు కూడా అలాగే ఉన్నారు.అయితే తాజాగా ఆయన వారసురాలు సితార సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.
మామూలుగా సితార సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా కనిపిస్తుంది.ఇప్పటివరకు సరైన ఇండస్ట్రీ పరిచయం లేని సితారకు తన తండ్రి తరపున, తన సోషల్ మీడియా వేదికగా తరపున మంచి అభిమానం ఉంది.
సోషల్ మీడియాలో సితార తన వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఎక్కువగా తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను, డాన్స్ వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు పండగల సందర్భంగా విషెస్ లాంటివి కూడా చెబుతూ ఉంటుంది.ఈ కుటుంబం హిందువుస్ అయినప్పటికీ కూడా ఇతర మతాలకు కూడా గౌరవం ఇస్తారు.
అయితే త్వరలో క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా.ఇప్పటి నుంచే క్రిస్మస్ సోదరులు సంబరాలను మొదలుపెట్టారు.
అయితే తాజాగా మహేష్ బాబు ఇంట్లో కూడా క్రిస్మస్ ట్రీ పెట్టి సంబరాలు మొదలుపెట్టారు.దీంతో సితార క్రిస్మస్ ట్రీ తో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది.
అయితే తను షేర్ చేసుకున్న ఒక ఫోటోలో మాత్రం క్రిస్మస్ ట్రీ తో పాటు హిందూ దేవుళ్ళు కూడా దర్శనమిచ్చారు.ఇక ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ చాలా ఫిదా అవుతున్నారు.
మతాల మధ్య ఎటువంటి తేడాలు చూపించకుండా మంచి భావనతో ఉన్నారు అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం ఆ పోస్ట్ మాత్రం బాగా వైరల్ అవుతుంది.