శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) డైరెక్షన్ లో విరాట్ కర్ణ హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా 48 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెదకాపు1 సినిమా( Peda Kapu-1 ) రేపు థియేటర్లలో విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రముఖుల కోసం స్పెషల్ షోను ప్రదర్శించారు.
నిన్న రాత్రి ఈ షో ప్రదర్శితం కాగా సినిమాను చూసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు శ్రీకాంత్ అడ్డాల మరో వేట్రిమారన్( Vetrimaaran ) అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నారప్ప తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కాగా పెదకాపు1 సినిమాలో క్యారెక్టర్లు కానీ, విజువల్స్ కానీ డైలాగ్స్ కానీ సీన్లు కానీ బెస్ట్ అనేలా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కొన్ని ఫ్రేమ్స్, షాట్స్ చూస్తే ఎంత అభినందించినా తక్కువే అనిపించిందని ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు చెప్పుకొచ్చారు.శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాలో రక్తం ఏరులై పారిండాలని ఈ సినిమా ఎఫెక్టివ్ పొలిటికల్ డ్రామా( Political Drama ) అని క్రిటిక్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని క్రిటిక్స్ చెబుతున్నారు.శ్రీకాంత్ అడ్డాల కమ్ బ్యాక్ మూవీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
క్రిటిక్స్ ఈ సినిమాకు 2.75 రేటింగ్( Peda Kapu-1 Rating ) ఇస్తున్నారు.ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈరోజు విడుదలైన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పెదకాపు1 సినిమాపై ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.