అమరావతిలోని మైలవరం నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ సమావేశం అయ్యారు.మైలవరంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే మైలవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేశ్ మధ్య గత కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ విషయంలో పార్టీ అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.జగన్ రాకతోనైనా ఆధిపత్య పోరు వ్యవహారం కొలిక్కి వస్తుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.