ఆ డైరెక్టర్ కు డెడ్ లైన్ పెట్టిన నాగార్జున..?

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.గతేడాది బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ గా వ్యవహరించి ఆ షో సక్సెస్ కు కారణమైన నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నారు.

 Star Hero Nagarjuna Dead Line To Director Praveen Sattaru, Dead Line, Garudavega-TeluguStop.com

వైల్డ్ డాగ్ సినిమా ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే కానుకగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని తెలుస్తోంది.ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపకపోవడం వల్ల నాగార్జున తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా తరువాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారని సమాచారం.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగార్జున గరుడవేగ సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే నాగార్జున వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని తెలుస్తోంది.

Telugu Line, Garudavega, Nagarjuna, Praveen Sattaru-Movie

స్క్రిప్ట్ వల్ల సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో నాగార్జున ప్రవీణ్ సత్తారు కొంత సమయం ఇచ్చి అప్పటిలోపు స్క్రిప్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారని సమాచారం.ఒకవేళ ఏదైనా కారణం వల్ల ప్రవీణ్ సత్తారు స్క్రిప్ట్ పనులు పూర్తి చేయలేకపోతే మాత్రం నాగార్జున వేరే డైరెక్టర్ తో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం న్యూ ఇయర్ వెకేషన్ టూర్ లో ఉన్న నాగార్జున వెకేషన్ తరువాత కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ సినిమాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.అఖిల్ హీరోగా ఇప్పటివరకు నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తుండగా సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube