ఏపీలో ముందస్తు ఎన్నికల వార్తలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు( AP Early Elections ) వచ్చే అవకాశం ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.జులై ఐదవ తారీకు సీఎం జగన్( CM Jagan ) ఢిల్లీ పర్యటన క్రమంలో ప్రధాని మోడీతో( PM Modi ) పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఈ విషయంపై చర్చించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 Sajjala Ramakrishna Reddy Reacts To The News Of Early Elections In Ap Details, S-TeluguStop.com

ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సైతం ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా వస్తున్న ముందస్తు ఎన్నికల వార్తలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇదే విషయాన్ని చాలా సార్లు స్పష్టం చేసినట్లు గుర్తు చేయడం జరిగింది.ముందస్తు ఎన్నికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.అటువంటి వార్తలలో వాస్తవం లేదని సజ్జల పేర్కొన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలం వరకు ఉంటామని స్పష్టం చేశారు.ఐదేళ్ల కాలం చివరి వరకు సీఎం జగన్ రాష్ట్రాన్ని పాలిస్తారని.

ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని అన్నారు.ఈ రకంగా చంద్రబాబు చేస్తున్న గేమ్ ప్లాన్ అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు ( Chandrababu Naidu ) ఏం చేసినా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు మాత్రం రావు అని తేల్చి చెప్పారు.వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలే జగన్ నీ మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయని జోష్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube