ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2022లో లీగ్ మ్యాచ్ లన్ని పూర్తయిపోయాయి.టి20 ప్రపంచ కప్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.ఇంకొన్ని గంటల్లో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.భారత్ కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు సిడ్నీ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పాకిస్తాన్ తలపడనున్నాయి.
ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఫైనల్ జరుగుతుంది.
అయితే భారత్ తో సెమీఫైనల్స్ కు ముందు ఇంగ్లాండ్ టీంకు ఊహించని షాక్ తగిలింది.
డేవిడ్ మలన్ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం మలాన్ గజ్జలు గాయంతో బాధపడుతున్నాడు.
అందువల్ల నెట్ ప్రాక్టీస్ కి కూడా దూరంగా ఉంటున్నాడు.ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు.
డేవిడ్ మలన్ స్థానంలో ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకోవడం ఉన్న ఈ సమస్య తీరిపోయింది అనుకున్నారు ఇలాంటిమంతా.అయితే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ భారత్‌తో సెమీ ఫైనల్‌లో ఆడేది అనుమానమే అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఇంగ్లాండ్ ఫస్ట్ బౌలర్ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు.ఈ ఇబ్బంది వల్లనే ట్రైనింగ్ స్టేషన్ నుంచి మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోయాడు.
వందశాతం ఫిట్‌నెస్‌తో ఉంటేనే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ సెమీస్‌లో ఆడే అవకాశం ఉంది.లేదంటే అతని స్థానంలో మరో కొత్త బౌలర్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు కచ్చితంగా ఎదురవుతుంది.ఇప్పటివరకు 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్కువుడ్ సెమీఫైనల్స్ లో బలమైన భారత జట్టు ను ఎదుర్కోబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్క్ వుడ్ ఆడేది అనుమానంగా ఉండడంవల్ల ఇంగ్లాండ్ జుట్టుకి దెబ్బ మీద దెబ్బ పడినంత పని అయింది.