RK Roja Nara Lokesh: పిల్ల పిత్రే.. తింగరోడా అంటూ... లోకేష్ పై ?

టీడీపీ ని ఎవరు విమర్శించాలన్న ముందుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టార్గెట్ చేసుకునే అంతా విమర్శలు చేస్తుంటారు.ముఖ్యంగా వైసిపి ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉంది.

 Ycp Minister Rk Roja Satires On Nara Lokesh Details, Nara Lokesh, Chandrababu, T-TeluguStop.com

లోకేష్ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా రాబోయే రోజుల్లో టిడిపి ని నడిపించగల శక్తి సామర్థ్యాలు లేని నేతగా లోకేష్ ను చూపించేందుకు ఏపీ అధికార పార్టీ వైసిపి ప్రయత్నాలు చేస్తుంది.ఇక లోకేష్ సైతం వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రకరకాల కామెంట్ లు చేస్తూ ప్రభుత్వాన్ని జనాల్లో అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ వ్యవహారం ఇలా ఉంటే.వైసిపి తరఫున యాక్టివ్ గా ఉంటూ మొదటి నుంచి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ తన సత్తా చాటుకుంటూ వస్తున్న ఏపీ మంత్రి ఆర్కే రోజా లోకేష్ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు.

మంగళగిరిలో నారా లోకేష్ గెలిచే అవకాశం లేదు అంటూ మొదలుపెట్టిన రోజా ఇంకో 20 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నే అధికారంలో ఉంటుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నెగ్గేదే లేదు అంటూ సినిమా డైలాగ్ ను చెప్పారు.అంతేకాదు నారా లోకేష్ ను ఉద్దేశించి పప్పు … పిల్ల పిత్రె అంటూ సెటైర్లు వేశారు.

మొదటి నుంచి టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసుకుని రోజా అనేక విమర్శలు చేస్తూనే ఉన్నారు.మంత్రి కొడాలి నాని, రోజా లతో పాటు, రోజా కూడా ఈ స్థాయిలో విమర్శలు చేసేవారి లిస్టులో చేరిపోయారు.

Telugu Ap Cm Jagan, Chandrababu, Lokesh, Pawan Kalyan, Rk Roja, Rk Roja Lokesh,

జగన్ పైన కానీ ప్రభుత్వం పైన గాని ఎవరు విమర్శలు చేసినా రోజా తన నోటికి పని చెబుతూ,  వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అటు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు , టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గెలవకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా  వైసిపి పావులు కదుపుతోంది.ఈ క్రమంలోనే రోజా వంటి వారు తరచుగా తమ దైన శైలిలో విమర్శలు చేస్తూ లోకేష్ పరపతిని మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube