నల్లగొండ జిల్లా: మర్రిగూడ తహసీలద్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై శనివారం ఏసీబీ దాడులు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపాయి.తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నొట్ల కట్టలు ఉన్నట్లు, ఒక్క ట్రంక్ పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైనట్లు,ఇంటిలో కిలోల కొద్ది బంగారం దొరికినట్లు తెలుస్తోంది.
మహేందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణలు ఉన్నాయి.మహేందర్ రెడ్డికి సంబంధించిన 15 చోట్ల ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.







