ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు దాదాపు ప్రతి పండుగను తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.ఎన్ని పండుగలు ఉన్న దసరా( Dasara ) శరన్నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజులు రోజుకో అలంకరణతో అమ్మవారు దర్శనం ఇస్తారు.
ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రం ధరించడమే కాకుండా నైవేద్యాలు కూడా ప్రత్యేకమే అని పండితులు ( Scholars )చెబుతున్నారు.అసలు ఏ ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలని విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంవత్సరంలో చైత్రం మొదలు భాద్రపద మాసం వరకూ తొలి అర్ధభాగం పురుష రూపాత్మకం అని పండితులు చెబుతున్నారు.

ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల 6 మాసాల కాలం స్త్రీ రూపాత్మకం అని పండితులు చెబుతున్నారు.ప్రత్యేకించి రెండోవ అర్ధ బాగంలోని తొలిమాసం ఆశ్వయుజం.అందుకే శరన్నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి అని పండితులు చెబుతున్నారు.
ఆశ్వయుజ శుద్ధ పాండ్య నుంచి దశమి వరకు రోజుకో అలంకరణలో దర్శనమిచ్చే అమ్మ వారికి ఈ రోజుకో నైవేద్యం కూడా సమర్పిస్తారు.మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాండ్యమి( Aswayuja Suddha Pandyami ) ఈ రోజు శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవి అవతారంలో కనిపించే అమ్మవారికి కట్టు పొంగలినీ నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈ దసరా నవరాత్రులలో మహిళలు ఒక్క పుటే తింటారు.వారికి సరైన శక్తి కోసం ఈ నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు.

అలాగే శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి( Sri Balatripura Sundari Devi ) అవతారం రోజు పులిహార నైవేద్యంగా పెడతారు.శ్రీ గాయత్రీ దేవి అలంకరణలలో అమ్మవారు దర్శనమిస్తే గాయత్రీ దేవికి కొబ్బరి అన్నం ( Coconut rice )సమర్పిస్తారు.లలితా దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తే కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.అన్నపూర్ణ అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తే అమ్మవారికి పంచభక్షాలు నైవేద్యంగా సమర్పిస్తారు.శుద్ధ సప్తమి రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తే అమ్మవారికి దధ్యోజనం నైవేద్యంగా సమర్పిస్తారు.అష్టమి రోజు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తే అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.
నవమి రోజు అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.దశమి రోజు శ్రీ రాజా రాజేశ్వరి దేవి( Shri Raja Rajeshwari Devi )కి గారెలు, పాయసం, పులిహోర, నైవేద్యంగా సమర్పించవచ్చు.
కచ్చితంగా ఇవే పెట్టాలని లేదు ఎవరి శక్తికి తగిన నైవేద్యం వారు సమర్పించవచ్చు.
DEVOTIONAL