మనలో కొందరికి ఎంత తిన్నా కాసేపటికి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది.ఇంకొన్ని సార్లు ఇలా తిని అలా బయటకు వెళ్లి రాగానే మళ్లీ అతిగా ఆకలి వేస్తూ ఉంటుంది.
మరి కొన్నిసార్లు ఒళ్ళు చెమటలు పట్టడం, గుండె దడగా అనిపించడం,కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.నాలుగైదు రోజులు గనుక కంటిన్యూగా ఈ లక్షణాలు కనిపిస్తే టైప్ 2 డయాబెటిస్( Type 2 diabetes ) గా అనుమానించాలని చెబుతున్నారు.
ఎందుకంటే రక్తంలో గ్లూకోస్ పెరగడం వల్ల కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయని చెబుతున్నారు.వాస్తవానికి టాప్ 2 డయాబెటిస్ ఒక జీవ క్రియను కూడా ప్రభావితం చేస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే బాధితులలో గ్లూకోస్ హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి.బాడీ ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకో లేనప్పుడు ఈ పరిస్థితికి దారి తీస్తుంది.అలాగే ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే అది మూత్రపిండాలు,గుండె వైఫల్యనికి వంటి సమస్యలకు దారి తీయవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే రక్తంలో షుగర్ లేదా గ్లూకోస్ లెవెల్స్ పెరిగిన తగ్గినా కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
పెరిగినప్పుడు అధికంగా దాహం వేస్తూ ఉంటుంది.ఐదు అంతకంటే ఎక్కువ గ్లాసుల నీళ్లు తాగిన ఇంకా దాహం తీరని ఫీలింగ్ ఉంటుంది.

అలాగే యూరిన్ కు వెళ్లాలనిపిస్తుంది.గ్లూకోస్ లెవెల్స్ క్రాష్ అయ్యే క్రమంలో గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్లు, చేతులు చెమటలు పట్టడం,కళ్లు తిరగడం కళ్ళు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.దీనితో పాటు దేనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.కొన్ని సార్లు బ్రెయిన్( Brain ) లోని న్యూరాన్స్ మధ్య సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
ఆడవారిలో అయితే తల పై వెంట్రుకలు రాలడం, ముఖంపై వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలకు దారి తీయవచ్చు.కాబట్టి ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.







