టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి హీరోగా పేరు తెచ్చుకున్నాడు కళ్యాణం వెంకటసుబ్బయ్య. ఇతడిని ఈలపాట రఘురామయ్య అని కూడా పిలుస్తారు.
నిజానికి ఆ పేరుతోనే అతడు బాగా పాపులర్ అయ్యాడు.తెలుగు రంగస్థల, సినీ నటుడుగానే కాకుండా గాయకుడిగా రఘురామయ్య( Kalyanam Rahuramaiah ) మంచి పేరు తెచ్చుకున్నాడు.
గుంటూరు జిల్లా సుద్దపల్లిలో 1901 మార్చి 5న కల్యాణం నరసింహారావు, కళ్యాణం వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.అతనికి చిన్నతనం నుండే సంగీతం, నాటకాలలో మక్కువ ఉండేది.
చిన్నతనం నుంచే మ్యూజిక్ నాటకాలలో రాణించేవాడు.
అతను తన గానంతో పశువులను కూడా మైమరిచిపోయేలా చేసేవాడు.నోటిలో గోళ్ళతో ఈల వేస్తూ పాటలు పాడేవాడు.ఇలా ఈలపాటలు పాడితే ఆకట్టుకునేవాడు.
ఇక నాటక బృందంలో చేరి రఘురాముని పాత్రలో నటించి ఈలపాట రఘురామయ్యగా( Eelapata Raghuramaiah ) పేరు తెచ్చుకున్నారు.కృష్ణుడి పాత్రను కూడా ఎన్టీఆర్‌తో పోల్చేంత బాగా నటించేవాడు.
రఘురామయ్య టాలెంట్ గురించి తెలుసుకొని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ, వి.వి.గిరి వంటి ప్రముఖులే అతడిని ఎంతో పొగిడారు.నెహ్రు( Nehru ) రఘురామయ్య టాలెంట్ చూసి నమ్మలేకపోయారు.
ఆయన చేతిలో ఏదైనా పరికరాన్ని దాచారా అని కూడా అడిగి తన అపనమ్మకాన్ని వ్యక్తం చేసేవారు.దాన్నిబట్టి రఘురామయ్యకు ఎంత అరుదైన టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.రఘురామయ్య తన కెరీర్‌లో సుమారు 20,000 నాటకాలు, 100 చిత్రాలలో నటించారు.శ్రీ రామాంజనేయ యుద్ధంలోని( Sri Ramanjaneya Yuddham ) ప్రసిద్ధ ‘రామ నీల మేఘ శ్యామా’తో సహా అనేక పాటలు కూడా పాడాడు.
భారతీయ సాంస్కృతిక బృందంలో సభ్యుడిగా జపాన్, ఇతర తూర్పు ఆసియా దేశాలకు వెళ్లి తన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ( Padma Shri ) వంటి అవార్డులను అందుకున్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, సత్యసాయి బాబా వంటి ప్రముఖులు మెచ్చుకున్నారంటే అతని ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.దురదృష్టం కొద్దీ ఈ కళాకారుడు 1975 లో 75 సంవత్సరాల వయస్సులోనే గుండెపోటుతో మరణించాడు.
రఘురామయ్య 1938లో బాపటాలలో రంగస్థల నటి ఆదోని లక్ష్మిని( Adoni Lakshmi ) వివాహం చేసుకున్నారు.వీరికి ఐదుగురు సంతానం కాగా వారిలో ఇద్దరు రూపాదేవి,( Rupadevi ) కళ్యాణం రామకృష్ణ( Kalyanam Ramakrishna ) తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
రఘురామయ్య వారసత్వాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆయన జన్మస్థలమైన సుద్దపల్లిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.