దాదాపు రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.కరోనా సోకిన చాలా మంది వైద్యం అందక చనిపోగా… కొంత మంది లక్షలు వెచ్చించి ప్రాణాలను కాపాడుకున్నారు.
హమ్మయ్య అనే లోపే ఏదో కొత్త కంగారు ముంచుకొస్తోంది.ఇది వరకే చాలా రకాలుగా మనుషుల సహనాలను పరీక్షించిన కరోనా తాజాగా మరో కొత్త చిక్కు తెచ్చి పెట్టింది.
కరోనా వచ్చి కోలుకున్న వారిలో ఎముకల సమస్యలు వస్తాయని అది బోన్ డెత్ కు దారితీస్తుందని చాలా మంది చెబుతున్నారు.ఎముకలు పాడైపోయి కుళ్లిపోయే స్థితినే బోన్ డెత్ అని పిలుస్తారు.
ఇలా బోన్ డెత్ సమస్య ఉత్పన్నం కావడానికి కరోనా ట్రీట్ మెంట్ సమయంలో వాడిన స్టెరాయిడ్స్ కడూఆ ఒక కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.ఇలా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వారిలో దాదాపు రెండు నెలల తర్వాత ఈ బోన్ డెత్ సమస్య ఉద్భవిస్తుండడం గమనించినట్లు పేర్కొంటున్నారు.
ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అని వైద్యులు బోన్ డెత్ ను ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అని పిలుస్తుంటారు.

ముఖ్యంగా ఈ బోన్ డెత్ సమస్య తుంటి కీళ్లల్లోనే వస్తున్నట్లు గమనించారు.తుంటి కీళ్లకు ముందుగానే రక్తం సరిగా ప్రసరణ కాదంటే కరోనా చికిత్సలో వాడే స్టెరాయిడ్స్ మూలాన రక్తం పోవడం ఇంకా తక్కువ అవుతుందని అందువల్లే ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.అందరు కోవిడ్ రోగులకు కాకుండా స్టెరాయిడ్స్ అధికంగా తీసుకుని చికిత్స చేయించుకున్న వారికే ఈ వ్యాధి అధికంగా వస్తుందని నిర్ధారించారు.
సాధారణంగా స్టెరాయిడ్స్ వాడిన రెండేళ్ల తరువాత ఉద్భవించే బోన్ డెత్ సమస్యలు కోవిడ్ రోగుల్లో మాత్రం రెండు నెలల్లోనే రావడం గమనార్హం.నాలుగు దశలుగా ఉన్న ఈ వ్యాధిని మొదటి దశలోనే అరికట్టడం మూలాన ఆరోగ్యంతో పాటు డబ్బులను రక్షించుకోవచ్చు.