ఐస్ క్రీమ్ లంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.పిల్లలకయితే ఇక చెప్పనక్కర్లేదు.
వాళ్ల తల్లిదండ్రులు ఐస్ క్రీమ్ తింటే పళ్లు పుచ్చిపోతాయని చెప్పినా కూడా వినిపించుకోకుండా తింటూ ఉంటారు.పలు సందర్బాల్లో వారి ఆగ్రహానికి కూడా గురవుతారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐస్ క్రీమ్ లకు భారీగా డిమాండ్ ఉంది.సాధారణంగా ఈ ఐస్ క్రీమ్ ల ధరలను పరిశీలిస్తే.100 రూపాయల నుంచి మొదలుకుని వేయి రూపాయల వరకు ఉంటాయి.అనేక మంది అబ్బాయిలు అమ్మాయిల దగ్గరకు వెళ్లేటపుడు వారికి ఇష్టమైన ఐస్ క్రీమ్ లు తీసుకెళ్తుంటారు.
సాధారణ ధరల్లో లభించే ఐస్ క్రీమ్ ల గురించి మాత్రమే విన్న మనం దుబాయ్ లో లభించే ఐస్ క్రీమ్ లను చూస్తే షాక్ కావాల్సిందే.
దుబాయ్ లోని జువేరా రోడ్లో ఉండే ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఏకంగా ఐస్ క్రీమ్ కు కళ్లుచెదిరే రీతిలో 840 డాలర్ల ధర ఉంటుందట.
అంటే మన భారతదేశ కరెన్సీలో దాదాపు 60వేల రూపాయలు అన్న మాట.ఇది వినేందుకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఈ విషయాన్ని ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన ట్రావెలర్ షెనాజ్ పేర్కొంది.అంతే కాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేసింది.
అంతలా రేటు ఉండడానికి ఇక్కడి ఐస్ క్రీమ్ లో ఏం వాడతారబ్బా? అనే సందేహం అందరికీ కలుగుతుంది.

ఇక్కడ లభించే చేసే ఐస్ క్రీమ్ లో వెనీలా బీన్స్ ను వాడతారు.వీటికి చాలా రేటెక్కువగా ఉంటుంది.అంతే కాకుండా తినడానికి వీలుగా ఉన్న బంగారపు రేకులను కూడా వాడుతారు.
అందుకే ఈ ఐస్ క్రీమ్ కు అంత డిమాండ్.దీనికి బ్లాక్ డైమండ్ అనే పేరును ఫిక్స్ చేశారు.
షెనాజ్ అనే ట్రావెలర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.