ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసే వ్యాయామాలు ఇవే..!

శీతాకాలంలో( Winter ) గాలిలో దుమ్ము, కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి.అయితే దీపావళి తర్వాత కూడా చాలా చోట్ల గాలి నాణ్యత పడిపోతూ ఉంటుంది.

ఎందుకంటే ఎక్కువగా టపాసులు కాల్చడం, వాహనాలు, ఫ్యాక్టరీల నుండి విడుదల అయ్యే పోగల వలన వాయు కాలుష్యంగా( Air Pollution ) మారిపోతుంది.

మరి ఇలాంటి వాతావరణాల్లో మనం తిరుగుతున్నందుకు ఆ ప్రభావం మన ఊపిరితిత్తులపై( Lungs ) ఖచ్చితంగా పడుతుంది.

కాబట్టి వాటిని శుభ్రం చేసుకోవడానికి మనం సొంతంగా కొన్ని డీప్ బ్రీతింగ్ ఎక్ససైజ్ చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.h3 Class=subheader-styleచెస్ట్ బ్రీతింగ్:/h3p దీని కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా కూర్చోవాలి.

ఆ తర్వాత ముక్కు నుండి( Nose ) గాలిని వీలైనంత లోపలికి తీసుకోవాలి.

ఇలా చేసినప్పుడు చాతి భాగం ఎంత వీలైతే అంత విస్తరించాలి.అలా శ్వాసను నిలబెట్టి ఎంత సేపు ఉంచగలిగామో అంత సేపు ఉంచాలి.

ఆ తర్వాత దాన్ని నోటి ద్వారా బయటకు వదిలేయాలి.దీనిలో ఛాతి విస్తరించడం, మళ్ళీ సాధారణ స్థితికి రావడం పై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

"""/" / H3 Class=subheader-styleనోస్ట్రల్ బ్రీతింగ్:/h3p నిదానంగా కూర్చుని వెన్నుపాము( Backbone ) నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

ఇక కుడి చేతితో కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు నుండి దీర్ఘంగా శ్వాసను లోపలకు తీసుకోవాలి.

ఆ తర్వాత ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు నుంచి గాలిని ( Air ) బయటకు వదిలేయాలి.

ఇలా ఒక ముక్కు నుండి శ్వాస తీసుకోవడం మరో ముక్కు నుండి శ్వాస వదలడం చేయాలి.

ఇలా 10 సైకిల్స్ వరకు చేయాలి. """/" / H3 Class=subheader-styleశ్వాసను పట్టి ఉంచడం:/h3p నిదానంగా సుఖాసనంలో కూర్చోవాలి.

ముక్కు నుండి దీర్ఘంగా శ్వాసను లోపలికి పీల్చుకొని, ఎంతసేపు వీలైతే అంత సేపు దాన్ని అలాగే పట్టి ఉంచాలి.

ఆ తర్వాత మెల్లగా గాలిని బయటకు వదిలేయాలి.ఇలా చేయడం వలన లంగ్ కెపాసిటీ( Lung Capacity ) పెరుగుతుంది.

అలాగే ఆక్సిజన్ కూడా మెరుగుపడుతుంది.అయితే కాలుష్యంలో తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వలన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి.