న్యూస్ రౌండప్ టాప్ 20

1.నల్లమలలో విషవాయువులు విడుదల

నల్లమల అటవీ ప్రాంతమైన చందంపేట మండలం చింత్రియాల గ్రామంలో ని 9 గ్రామాల్లో గాలిలో విషవాయువులు విడుదలయ్యాయి.యురేనియం నిల్వలు ఉన్న ఆ ప్రాంతంలో పరిమితికి మించి థోరాన్, రేడాన్ వాయువులు వాడుతున్నట్లు ఓ యు సి బి ఐ టి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నిపుణుల పరిశోధనలు వెల్లడైంది.

 Ap And Telangana News Headlines, News Roundup, Top20news, Headlines,today Gold R-TeluguStop.com

2.జగిత్యాల జిల్లాలో బ్లాక్ ఫంగస్ తొలి మరణం

Telugu Ap Telangana, Lokesh, Gold, Top-Latest News - Telugu

జగిత్యాల జిల్లాలో బ్లాక్ కాంగ్రెస్ తొలి మరణం నమోదైంది మేడిపల్లి తాసిల్దార్ రాజేశ్వర్ హైదరాబాదులో చికిత్సపొందుతూ ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా మరణించారు.

3.ఈ-పాస్ ఉంటేనే అనుమతి

తెలంగాణ ప్రాజెక్టులు లాక్ డౌన్ ను పోలీసులు గతం కంటే చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు రాష్ట్ర సరిహద్దుల వద్ద ఈ-పాస్ లు ఉంటేనే తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తున్నారు.

4.తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో ఎంటర్ పరీక్షలను నిర్వహించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో జూన్ 1న దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

5.’ తుడుం దెబ్బ ‘ పై నిషేధాన్ని ఎత్తి వేయాలి

ఏ పార్టీతోనూ సంబంధం లేని తమ సంఘం ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ‘ తుడం దెబ్బ ‘ డిమాండ్ చేసింది.

6.నటుడు నిఖిల్ ను అడ్డుకున్న పోలీసులు

Telugu Ap Telangana, Lokesh, Gold, Top-Latest News - Telugu

లాక్ డౌన్ సమయంలో కారులో బయటకు వెళ్లిన సినీనటుడు నిఖిల్ ను పోలీసులు అడ్డుకున్నారు.ఈ పాస్ లేకుండా బయటకు రావడంతో పోలీసులు ప్రశ్నించారు అనే విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

7.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,22,315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పై లోకేష్ ఫైర్

Telugu Ap Telangana, Lokesh, Gold, Top-Latest News - Telugu

బనగానపల్లె టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ ప్రభుత్వంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ టిడిపి నేతలను అరెస్టు చేస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు.

10.నేడు నెల్లూరు కు రానున్న ఐసీఎంఆర్ బృందం

ఆనందయ్య కరోనా మందు పరిశీలన కోసం ఈ రోజు ఐసీఎంఆర్ బృందం నెల్లూరు జిల్లా కి రానుంది.

11.నేడు మిలటరీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జి

మిలటరీ హాస్పటల్లో ఉన్న రఘురామ కృష్ణంరాజు నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

12.తిరుమల సమాచారం

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది.ఆదివారం 9,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

13.టిడిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

14.బంగళా ఖాతంలో ‘ యాస్ ‘

Telugu Ap Telangana, Lokesh, Gold, Top-Latest News - Telugu

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం ఉదయం యాస్ తుఫానుగా మారనుండడంతో తమిళనాడు లోని నాలుగు జిల్లాల్లో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

15.యూపీలో మిడతల భయం

రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరంలో మిడతల దండు ని అధికారులు గుర్తించారు.ఈ మిడతల దండు అనేక ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉందని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

16.ఉత్తరాఖండ్ లో అర్ధరాత్రి భూకంపం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది.ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని జోషిమత్ ప్రాంతం కేంద్రంగా అర్ధరాత్రి 12.31 గంటలకు భూమి కంపించింది.

17.నేటి నుంచి టీకా కార్యక్రమం

Telugu Ap Telangana, Lokesh, Gold, Top-Latest News - Telugu

హైరిస్క్ కేటగిరీకి చెందిన 45 ఏళ్లు పైబడిన వారికి సోమవారం నుంచి మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ కోసం జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ వెల్లడించారు.

18.ఆక్సిజన్ డిమాండ్ తగ్గుముఖం

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండడంతో క్రమేపీ ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతూ వస్తోంది.మే 9 న 8,944 మెట్రిక్ టన్నుల మేర ఆక్సిజన్ సరఫరా కాగా తాజాగా 8,344 మెట్రిక్ టన్నులకు చేరినట్టు తెలుస్తోంది.

19.తెలుగులోనూ ఈ కోర్ట్స్ మొబైల్ యాప్

కోర్టుల్లో నడుస్తున్న కేసుల స్థితిగతులను తెలిపే ‘ ఈ కోర్ట్స్ ‘ సర్వీసెస్ మొబైల్ యాప్ సేవలను సుప్రీంకోర్టు తెలుగు సహా దేశంలోని 14 ప్రధాన భాషలలోకి అందుబాటులోకి తెచ్చింది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Lokesh, Gold, Top-Latest News - Telugu

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,000.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube