తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.సినిమా విడుదలకు చాలా సమయమే ఉన్నప్పటికీ రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను విడుదల చేస్తూ ఆర్ఆర్ఆర్ పై అంచనాలను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ పేర్లతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన టీజర్లు విడుదల కాగా ఈ టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.దీపావళి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.
రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముచ్చట్లు చెప్పుకుంటున్న ఫోటోలు ఆర్ఆర్ఆర్ సినిమా ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదలయ్యాయి.

ప్రస్తుతం రాజమౌళి చరణ్ తారక్ ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రామ్ చరణ్ కాలికి ఉన్న బ్యాండ్ ను చూసి కొందరు రామ్ చరణ్ కాలికి మళ్లీ గాయమైందంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.దీంతో చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో చిన్నచిన్న గాయాలయ్యాయి.
దీంతో మరోసారి రామ్ చరణ్ కు గాయమైందా.? అనే ప్రశ్న చరణ్ అభిమానులను వేధిస్తోంది.
అయితే చరణ్ బ్యాండ్ కు గాయమే కారణమో ఇతర కారణాలేమైనా ఉన్నాయో తెలియాల్సి ఉంది.ఆర్ఆర్ఆర్ యూనిట్ కానీ రామ్ చరణ్ కానీ స్పందిస్తే మాత్రమే రామ్ చరణ్ బ్యాండ్ కు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా బాహుబలి 2 కలెక్షన్లను క్రాస్ చేసి కొత్త రికార్డులను సృష్టిస్తుందని చరణ్, ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.