నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’.ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కాని తాజాగా నెలకొన్న కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా విడుదల కాలేదు.
అలాగే షూటింగ్ కూడా ముగియలేదు.అయినా కూడా సినిమాకు వస్తున్న బిజినెస్ ఆఫర్లు చూస్తే అంతా కూడా అవాక్కవుతున్నారు.

దర్శకుడు శేఖర్ ఈ సినిమాకు కేవలం 25 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశాడట.అది కూడా అయ్యిందో లేదో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అలాంటి సినిమాకు ఓవర్సీస్ రైట్స్ ద్వారా 8 కోట్ల వరకు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక శాటిలైట్ రైట్స్‌ను 15 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒక ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ సిద్దంగా ఉంది.
ఇక ఓటీటీ రైట్స్ ద్వారా మరో 5 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేస్తున్నారు.మొత్తానికి ఈ మూడు రైట్స్ ద్వారానే సినిమా బడ్జెట్ రికవరీ అవుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల రైట్స్‌తోI పాటు ఇతరత్ర రైట్స్ ద్వారా మరో పాతిక కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది.సినిమా హిట్ అయితే మరింత లాభం.
అంటే ఈ చిత్రం నిర్మాతలకు తక్కువలో తక్కువ పాతిక కోట్ల వరకు లాభాలు రావడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.