నేడు,రేపటీలో ప్రధాని కీలక ప్రకటన, నెలాఖరువరకు లాక్ డౌన్ కొనసాగించే అవకాశం

దేశంలో లాక్ డౌన్ పొడిగింపు అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాస్కులు ధరించి మరి పాల్గొన్నారు.

అయితే ఈ సమావేశంలో రాష్ట్రాల సీఎం లు అందరూ కూడా లాక్ డౌన్ ను మరో 15 రోజుల పాటు కొనసాగిస్తేనే కరోనా ను కట్టడి చేయగలం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఒడిశా,పంజాబ్ రాష్ట్రాల్లో ఈ నెల 30 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే మిగిలిన రాష్ట్రాల సీఎం లు అందరూ కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది.అయితే దినసరి కూలీల విషయం లో,గ్రామీణ ప్రాంతాల్లో ఈ లాక్ డౌన్ ను సడలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ లాక్ డౌన్ అనేది అన్ని రాష్ట్రాల్లో అమలు పరచాలని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తరహా వద్దని సీఎం లు అందరూ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.అలానే వ్యవసాయం,రైతులకు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి.

Advertisement

రాష్ట్రాల సీఎం లతో వీడియో సమావేశం నిర్వహించిన మోడీ ప్రజా రోగ్యమే ప్రధాన లక్ష్యంగా అందరూ కృషి చేయాలనీ కోరారు.అయితే 24/7 అందరికి అందుబాటులో ఉంటానని తెలిపిన మోడీ ఎప్పుడైనా ఫోన్ చేసి అయినా మాట్లాడొచ్చు అంటూ సీఎం లకు స్పష్టం చేశారు.

అయితే లాక్ డౌన్ పొడిగింపు పై ఈ రోజు,రేపటి లో మోడీ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు