కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు 

ఎన్నికల ప్రచార సమయంలో ఒక పార్టీ అభ్యర్థులపై మరో పార్టీ అభ్యర్థులు విమర్శలు చేయడం సాధారణ అంశమే.తమ ప్రత్యర్థులపై వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేస్తూ, వారిని ఇరుకున పెట్టి,  రాజకీయంగా పై చేయి సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

 Ycp Sensational Allegations Against Kakinada Janasena Mp Candidate, Janasena, Ud-TeluguStop.com

అయితే తాజాగా కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ల శ్రీనివాస్( Uday Srinivas Tangella ) పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి.ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తప్పుడు సమాచారం ఇచ్చారని , ఆయన చదువు విషయంలో చెప్పింది వేరు,  ఇచ్చిన డాక్యుమెంట్లు వేరు అని వైసిపి ఆరోపణలు చేస్తోంది.

  అంతేకాదు ఉదయ శ్రీనివాస్ పై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని ,దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

Telugu Ap, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, Udaysrinivas, Ysrcp-Politi

ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచీ ఆయనపై అనే కారోపణలు వస్తూనే ఉన్నాయి.ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తికి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు .దుబాయ్ లో ఆర్థిక మోసాలు చేసి , అక్కడ నుంచి ఇండియాకు పారిపోయి వచ్చాడని ఉదయ్ శ్రీనివాస్ పై ఆరోపణలు ఉన్నాయి.ఇంటర్ చదివి ఇంజనీరింగ్ పూర్తి చేశానని చెప్పుకునే ఉదయ్  శ్రీనివాస్ లాంటి వాళ్లు తమ వ్యక్తిగత స్వార్థం చూసుకుంటారని , ప్రజలకు ఏం చేస్తారని సోషల్ మీడియాలోనూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది.తాజాగా కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కూడా ఇదే విషయంపై ఆరోపణలు చేస్తున్నారు.

ఉదయ్ శ్రీనివాస్ ఇంజనీరింగ్ చదివానని చెప్పుకున్నాడని , అయితే ఆయన చదివింది ఇంటర్మీడియట్ అని వైసిపి ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్( Chalamalasetty Sunil ) ఆరోపణలు చేస్తున్నారు.

Telugu Ap, Jagan, Janasena, Janasenani, Pavan Kalyan, Udaysrinivas, Ysrcp-Politi

నామినేషన్ సమయంలో అఫిడవిట్ లో కూడా ఇంటర్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.దుబాయ్ లో ఉదయ్ శ్రీనివాస్ పై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని,  దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని సునీల్ చెబుతున్నారు .దుబాయ్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అక్కడ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని ,అందుకే అక్కడి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని సునీల్ ఆరోపిస్తున్నారు.దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా ఆయన బయటపెట్టారు.దీంతో ఈ వ్యవహారం జనసేనకు ఇబ్బందికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube