కన్నడ బ్యూటీగా ఛలో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న, ఆ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.ఇక ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
యంగ్ హీరోల సినిమాలతో మొదలుకొని, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించే స్థాయికి ఈ చిన్నది చేరుకుంది.అయితే రష్మకి రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమాలో రష్మిక యాక్టింగ్‌కు చాలా మంది నెగెటివ్ కామెంట్స్ ఇచ్చారు.యాక్టింగ్ చేయాల్సిన రష్మిక ఈ సినిమాలో ఓవర్ యాక్టింగ్‌తో రెచ్చిపోయిందని, అందుకే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదని మహేష్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడ్డారు.
అయితే తాజాగా ఫ్యాన్స్‌తో లైవ్‌లో చాట్ చేసిన రష్మిక, తాను ఎలాంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందని వారిని అడిగింది.అయితే ఈ ప్రశ్నకు వారు దిమ్మతిరిగేలా మైండ్ బ్లాక్ అయ్యే రెస్పాన్స్‌లు ఇచ్చారు.
ఆమె యాక్టింగ్ చేస్తే చాలని, ఓవర్‌యాక్టింగ్ చేస్తే ఎన్ని సినిమాలు చేసినా వేస్ట్ అని వారు ఆమెపై మండిపడ్డారు.ఇక ఎలాంటి పాత్రైనా పర్లేదు కానీ, ఓవర్ యాక్టింగ్ మానుకుంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని కొందరు, దయచేసి తన ఓవర్‌యాక్టింగ్‌తో పుష్ప సినిమాను పాడు చేయొద్దంటూ మరికొందరు ఆమెను చెడుగుడు ఆడుకున్నారు.
మొత్తానికి అడిగి మరీ వాతలు పెట్టించుకున్నంత పని చేసింది ఈ బ్యూటీ.