నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాతో బాలయ్యను మరింత పవర్‌ఫుల్‌గా చూపెట్టేందుకు బోయపాటి తీవ్రంగా కష్టపడుతున్నాడు.ఇక ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమాను ఎంత పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాలని చూస్తున్నారో, అంతే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టాలని బోయపాటి భావిస్తున్నాడు.ఈ క్రమంలోనే తొలుత ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని చూసింది.
కానీ ఈ సినిమాకు అది ఎంతవరకు సెట్ అవుతుందో అనే ఆలోచనలో పడ్డ చిత్ర యూనిట్, మరో టైటిల్‌ను పెట్టాలని చూస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు ‘డేంజర్’ అనే టైటిల్‌ను పెడుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది.
కానీ ఆ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియకపోవడంతో అది కేవలం గాలివార్తేనని చిత్ర యూనిట్ తేల్చేసింది.కాగా ఈ సినిమాకు తాజాగా బొనాన్జా అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాతో ప్రేక్షకులకు బాలయ్య నిజంగానే బొనాన్జా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ ఈ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విమర్శకులు.