హీరో విశాల్ ఆ సినిమా న‌ష్టాలు భ‌రించాల‌ట..

ప్రముఖ తమిళ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.విశాల్ హీరోగా నటించిన ‘యాక్షన్’ సినిమా గతేడాది నవంబరులో విడుదల అయిన సంగతి తెలిసిందే.

 Yaction, Vishal, Hero Vishal , Chakra , Kollywod, Tollywood ,tamilnadu, Tamanna-TeluguStop.com

విశాల్ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన మూవీ యాక్ష‌న్.ట్రైల‌ర్ లు టీజ‌ర్లు దుమ్ములేపాయి.

త‌మ‌న్నా అందాలు, విశాల్ మేకోవర్ .లొకేష‌న్లు యాక్ష‌న్ సీన్లు అన్నీ యాక్ష‌న్ అనే సినిమాకి త‌గ్గ‌ట్లుగానే కనిపించాయి.సినిమాకి హైప్ బానే వ‌చ్చింది.కానీ రిలీజ్ అయ్యాక మాత్రం పూర్తిగా రివర్స్ అయింది.

మొదటగా ఈ యాక్షన్ సినిమాని తక్కువ బడ్జెట్ తో రూపొందించాలని అనుకున్నారు.కానీ , బడ్జెట్ తక్కువ అయితే సినిమా నాణ్యత తగ్గిపోతుందని , సినిమా రూ.20 కోట్లు కూడా వసూలు చేయలేకపోతే ఆ నష్టాలను తాను భరిస్తానంటూ నిర్మాతలకు నచ్చచెప్పారు.ఇక హీరోనే స్వయంగా మాట ఇవ్వడంతో ఆ నమ్మకం తో నిర్మాతలు ‘యాక్షన్’ సినిమా కోసం రూ.44 కోట్లు ఖర్చు చేశారు.కానీ, యాక్షన్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన రీతిలో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది.తమిళనాడులో రూ.7.7 కోట్లు, ఏపీ-తెలంగాణలో రూ.4 కోట్లు వసూలు చేసి భారీ నష్టాలు మిగిల్చింది.

ఇక ఈ నేపథ్యంలో, ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేతలు హీరో విశాల్ తో తమ నష్టాల గురించి చర్చిస్తే , నేను తర్వాత నటించే చక్ర చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లోనే చేస్తానని విశాల్ హామీ ఇచ్చారు.కానీ, ఇప్పుడు అతని సొంత బ్యానర్లో చేస్తున్నారంటూ ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇచ్చిన మాట ప్రకారం యాక్షన్ సినిమాతో నష్టపోయిన నిర్మాతలకు హీరో విశాల్ డబ్బు చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.విశాల్ రూ.8.29 కోట్లకు గ్యారంటీ ఇవ్వాలని స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube